ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?
మార్గదర్శి

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ప్రచురించబడిందిJan 10 2022
వ్రాసిన వారుParmis
అనేక ప్రయోజనాల కొరకు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేదికలలో టిక్‌టాక్‌ ఒకటి: సరదా మరియు వినోదం, కొత్త వ్యాపారాలని ప్రోత్సహించడం, అమ్మకాల్ని మరియు మార్కెటింగ్ ప్రచారాలని పెంచుకోవడం. విస్తృతమైన ప్రేక్షకులని చేరుకోవాలని మీరు ఎప్పుడైనా అనుకుంటే, మార్కెటింగ్ ప్రచారాల గురించి మరియు అవి మీకు ఏ విధంగా ప్రయోజనం చేస్తాయోనని కూడా మీరు అనుకోనే వుంటారు. అలా అయితే, టిక్‌టాక్‌లో మార్కెటింగ్ ప్రచారాల కొరకు ఎక్జోలైట్ అందించే గైడ్ కొరకు వేచియుండండి!
ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌కు పరిచయం
ఒక సర్వీసుని లేదా ప్రోడక్టుని ప్రచారం చేయడానికి పలుకుబడిని ఉపయోగించే సోషల్ మీడియా మార్కెటింగునే ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్ అంటారు. ఈ విధానికి గల ఆధారం ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అతని యొక్క ప్రేక్షకులలో మరియు అభిమానులలో పెంచే విశ్వాసమే. ఇదే అంతిమంగా ఆ బ్రాండ్‌కు సంబంధించిన ఒక అమ్మకపు అంశం.
కాని, ఈనాడు టిక్‌టాక్ మొత్తం ప్రచారాలు జరగడం వలన ప్రేక్షకుల యొక్క దృష్టిని ఆకర్షించడమనేది ఎక్కువ సవాలుతో కూడుకున్నది. ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్ ప్రచారాల కొరకు బ్రాండ్లు అనేవి ఎక్కువ వినూత్నమైన ఐడియాలను ఎంచుకుంటున్నాయి. అవి ఎక్కువగా ఆకర్షణని పొందడానికి ఇదే ఒక కారణం.
ఈ అంశం మీద మాయొక్క వ్యాసాన్ని చూడండి [ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఎందుకని సమీప భవిష్యత్తులో ఒక సంచలనం అవుతుందనే దానికి 11 కారణాలు}}(https://exolyt.com/guides/tiktok-influencer-marketing).
ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదా?
మీరు టిక్‌టాక్‌లోని అన్ని సాధ్యతలని ఉపయోగించుకునే విధంగా ఎక్జోలైట్‌లోని మేము చూసుకుంటాం. మీ ఖాతా గురించి మీరు తెలుసుకోవాల్సిన దేని గురించైనా పూర్తి విశ్లేషణని మాయొక్క బలమైన విశ్లేషణ వేదిక మీకు అందిస్తుంది. మీరు మార్కెటింగ్ ప్రక్రియ మార్కెటింగ్‌తో మొదలుపెట్టేలా ఇక్కడ వుండే మా నిపుణులు మీకు మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. వారి యొక్క టిక్‌టాక్‌ కంటెంట్‌పై పరిజ్ఞానాన్ని అందించడానికి మేము సోషల్ మీడియా ఏజెన్సీలతో, గ్లోబల్ బ్రాండ్లతో, మరియు ఒక్కరుగా పనిచేసే ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేస్తాము. ఒక డెమోని బుక్ చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే మీయొక్క ఉచిత ట్రయల్‌ని ప్రారంభించండి!
[టిక్‌టాక్‌ మార్కెటింగ్ ప్రచారాలకి!}} మా ఎక్జోలైట్ యొక్క గైడ్‌ని తప్పకుండా చూడండి. (https://exolyt.com/guides/tiktok-marketing-campaigns)
ఇన్‌ఫ్లూయెన్సర్లు (ప్రభావశీలురు) అంటే ఎవరు?
సామాజిక మాధ్యమం అనేది గత దశాబ్ద కాలంలో ప్రాముఖ్యత పరంగా విపరీతంగా పెరిగింది. జనవరి 2019, వి ఆర్ సోషల్ నివేదిక ప్రకారం, 3.484 బిలియన్ల మంది ప్రజలు ప్రతీరోజు సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. - అది మొత్తం ప్రపంచ జనాభాలో 45 శాతం. ఈ ప్రజలు మామూలుగానే వారి నిర్ణయాలలో సహాయం చేయడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వైపు మొగ్గుచూపుతారు.
ఒక ప్రత్యేకమైన అంశం మీద నైపుణ్యత కలిగివున్న వారిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి పేరు వుంది. వారు నిత్యం వారు ఎంచుకున్న చానళ్ళలో వారు ఎంచుకున్న అంశం మీద పోస్ట్ చేస్తూ వారి యొక్క అభిప్రాయలలో నిమగ్నమయ్యే, వారి అభిప్రాయాల పట్ల ఉత్సుకతని ప్రదర్శించే వారిని వారు ఆకర్షిస్తారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వారికి సంబంధించిన రంగంలో ట్రెండ్లను నమోదు చేయడానికి ఉపయోగించబడతారు కాబట్టి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మరియు కోలాహలాన్నిసృష్టించడానికి వారు ఒక గొప్ప మార్గం.
టిక్‌టాక్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్
మీయొక్క బ్రాండ్ కొరకు అత్యుత్తమ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలనే దానిపైన చిట్కాలు.
ఇన్‌ఫ్లుయెన్సర్లు పోషించే పాత్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంతవరకూ మనం చర్చించుకున్నాము. మీరు పనిచేయడానికి తగిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ని మీరు ఎంచుకునే మార్గాల గురించి ఇపుడు మనం చర్చించుకుందాం:
ఇన్‌ఫ్లుయెన్సర్‌ల యొక్క ప్రేక్షకుల గురించి ఆలోచించండి
ఒక బ్రాండ్ స్థానంలో, మీరు లక్ష్యంగా చేసుకున్న ప్రేక్షకులని కలిగివుంటారు. మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయమేంటంటే, మీరు ఎవరినైతే చేరుకోవాలనుకుంటున్నారో వారితో కలిసి ప్రయాణించడానికి దాదాపు అదే రకమైన ప్రేక్షకులని మీరు ఎంచుకునే ఇన్‌ఫ్లుయెన్సర్ కలిగివుండాలి.
మీయొక్క మార్కెటింగ్ ప్రచారానికి లక్ష్యాలని పెట్టుకోండి.
ప్రేక్షకుల కన్నా కూడా, మీరు చెప్పదలచుకున్న సందేశం ఒకటి వుంది - మీరు మీయొక్క బ్రాండ్‌పై అవగాహనని పెంచుకోవాలనుకుంటున్నారా? ఇదొక ప్రమోషనా? మీరు ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌నైనా సంప్రదించే ముందు లేదా ఈ మొత్తం వేటని ప్రారంభించే ముందు ఈ ప్రశ్నలు మరియు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా పరిష్కరించబడాలి.
కొంత కాలం పాటు కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లని పర్యవేక్షించండి.
ఈనాడు "ఒకరిని వెంబడించడం" అనేది అప్పుడో ఇప్పుడో మనలో చాలా మంది చేస్తారు కాబట్టి, అది చెడ్డ విషయమేం కాదు. మీరు ఎంచుకోబోయే ఇన్‌ఫ్లుయెన్సర్ల విషయంలో కూడా ఇదే పాటించి వారి యొక్క కార్యకలాపాలని పర్యవేక్షించండి; వారు ఎలాంటి కంటెంట్‌ని తయారు చేస్తారు? ఎవరిని లక్ష్యంగా చేసుకొని వారి కంటెంట్ వుంది? ఏ రకమైన వాతావరణాన్ని అవి కలిగిస్తున్నాయి?
మొదటి అవకాశం పైనే పూర్తిగా ఆధారపడకండి.
వెతుకుతున్న ప్రారంభంలో మీకు సరైన జోడి లభించినప్పటికీ, మీరు ఎంచుకోబోయే ఈ పలానా వ్యక్,తి మీయొక్క బ్రాండ్‌ను ప్రమాదంలో పడేసే అవకాశం కూడా వుందనే విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
వారి అనుచరుల సంఖ్య ప్రకారం
అనుచరుల సంఖ్య అనేది కొన్నిసార్లు బ్రాండ్ యొక్క ప్రజాదారణ మరియు విజయానికి సంబంధించి వుంటుంది. ఎక్కువ అనుచరులని కలిగివున్న బ్రాండ్ అనేది ఎక్కువ మందికి చేరే వీలుని మరియు ఎక్కువ పరిణామ శక్తిని కలిగివుంటుంది. సోషల్ మీడియా వ్యూహాన్ని ఏర్పరచుకునే క్రమంలో అనుచరుల సంఖ్యకి తక్కువ ప్రాధాన్యతని ఇవ్వమని మేము బ్రాండ్లకి గట్టిగా సూచిస్తున్నాము. అనుచరుల సంఖ్య అనేది సోషల్ మీడియా వ్యూహానికి ప్రధానమైనదే, కాని అది ముఖ్యమైనది లేదా గొప్ప ఫలితాన్నిచ్చేది మాత్రం కాదు.
ఇన్‌ఫ్లూయెన్సర్లకి ఎలా చెల్లింపు చేయాలి?
ఇన్‌ఫ్లుయెన్సర్లు మీయొక్క బ్రాండుకి ఉచితంగా ప్రాతినిధ్యం వహించడాన్ని మీరు ఆశించలేరు. మీ బ్రాండుని ఉచితంగా రుజువు చేయమని మీరు కోరే అవకాశం వున్నా, వారు ఆ పని చేయరు. వారికి లాభసాటిగా ఉండేలా మీరు చూడాలి. మీరు స్వయంగా వారితో వివరాలని చర్చించవలసి ఉంటుందని దయచేసి మీరు గమనించాలి. ఇన్ఫ్లుయెన్సర్లకి ఎలా చెల్లింపు చేయాలో ఇక్కడ కొన్ని సూచనలు వున్నాయి.
నగదు రూపంలో డబ్బు
మీ ప్రోడక్టుని ఉచితంగా ఇచ్చేయండి.
ఒక కమీషన్‌ని పొందుపరచండి.
వారి యొక్క సైట్ పైన వారికి ట్రాఫిక్‌ని పెంచే విధంగా వారిని ప్రమోట్ చేయండి.
పరస్పర అంగీకారం చేత జరిగే ఒక ప్రచారం కొరకు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి చెల్లింపు చేసే ఎన్నో ఇతర మార్గాలున్నాయి.
ఏది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కాదు?
ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే కేవలం ప్రేక్షకులని కలిగివున్న జనాలని కనుగొనడం, వారు మీ గురించి అనుకూలంగా మాట్లాడటం కొరకు వారిని వెలుగులోకి తేవడం లేదా వారికి డబ్బుని చెల్లించడం. ఇలా వైరల్ అయిన ప్రముఖులు చేస్తారు. వారి యొక్క బ్రాండుని సృష్టించుకోవడంలో సమయాన్ని వెచ్చించి, వారి యొక్క ప్రేక్షకులని పెంచుకున్న వారినే ఇన్‌ఫ్లుయెన్సర్లు అంటారు. వారు వారి యొక్క పేరుని, అదే విధంగా వారు సంపాదించుకున్న విశ్వాసాన్ని సహజంగానే రక్షించుకుంటారు. సోషల్ మీడియాలో విజయవంతం అవడానికి వీరు సహనాన్ని మరియు అవసరమైన ఏకాగ్రతని కలిగివుంటారు, ఒక్కొక్క నిజమైన అనుసరణని కలిగివుంటారు. కేవలం డబ్బు కోసం మాత్రమే వీరు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లో ఆసక్తిని కలిగివుండరు.
ఇది మొత్తం కూడా వేగవంతమైన ఫలితాల గురించి కాదు. సోషల్ మీడియా మరియు కంటెంట్ మార్కెటింగ్ విషయంలో నెమ్మది మరియు సహాయంతో కూడిన విధానం. మీయొక్క ప్రచారం అనేది ఉత్పత్తులను అమ్మడం గురించి కాదు; మీయొక్క రంగంలో మీయొక్క అధికారాన్ని మరియు విశ్వాసాన్ని నిరూపించడం వంటిది. మీరు ఏదైతే అందిస్తున్నారో దానికి పర్యాయ పదంగా మీరు వుండటం. ఉదాహారణకి, ఎవరైనా ఒక పత్రాన్ని ఫొటోకాపీ చేయడానికి బదులు జిరాక్స్ చేస్తానని అనడం లేదా నేలని వాక్యూమ్ చేయడానికి బదులు హూవర్ చేస్తానని అనడం లాంటిది.
సోషల్ మీడియా మార్కెటింగ్ సహాయంతో విశ్వాసం గల మరియు నిమగ్నతతో కూడిన అనుచరులని పెంచుకోవడమనేది చాలా నెమ్మదితో కూడుకున్న పని. తమ అనుచరుల యొక్క మనసుల్లోకి మరియు మెదళ్ళలోకి వెళ్ళడానికి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌తో భాగస్వామ్యం తీసుకోవడమనేది పనిని సులభతరం చేస్తుందని నమ్మడం సులభమే. కాని, అది కాదు విషయం. మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌తో కలవాలంటే, మీరు ముందుగా వారి యొక్క గౌరవాన్ని మరియు విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. వారి యొక్క విశ్వాసాన్ని మరియు గౌరవాన్ని మీరు ఎలా సంపాదిస్తారు?
చివరగా ఏంటంటే, ఇన్‌ఫ్లుయెన్సర్‌లను వెతకడంలో మీయొక్క మార్గాన్ని మీరు సాధారణం చేసి చెప్పొచ్చు, కానీ అదే మార్గాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్‌లందరికీ వర్తింపజేయడం కుదరదు. ఇన్‌ఫ్లుయెన్స్ (ప్రభావితం చేయడం) అనేది కేవలం ప్రజాదారణ గురించే కాదు. వినియోగదారులు ఖచ్చితమైన చర్యని తీసుకునేలా చేయడమే మీ ముందున్న లక్ష్యం. ఎంచుకున్న రంగంలో ఎక్కువ అనుచరులని కలిగివున్నవారే ఇన్‌ఫ్లుయెన్సర్‌లని మీరు అనుకోకపోవడమే మీకు సాయం చేస్తుంది.
ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఈరోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి. సరైన వ్యూహ ప్రణాళికతో కలిపి గనుక దీనిని అమలు చేస్తే, ఇది మీయొక్క బ్రాండుని ఎంతో ఎత్తుకి తీసుకొని వెళ్ళొచ్చు.
[object Object] from Exolyt
Parmis from Exolyt
ఈ వ్యాసం Parmis చేత రాయబడింది. ఆవిడ గారు Exolytలో కంటెంట్ సృష్టికర్తగా పనిచేస్తున్నారు. సరికొత్త టిక్‌టాక్‌ ట్రెండ్లతో తనను తాను అప్‌డేట్‌లో ఉంచుకుంటూనే, రాయడంలో మరియు కొత్త విషయాల్ని కనుగొనడంలో ఆమె ఆసక్తిని కలిగివున్నారు.
7 May 2022

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

4 May 2022

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

14 Apr 2022

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

5 Apr 2022

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ

29 Mar 2022

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటో మరింత చదవండి

14 Mar 2022

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!

24 Jan 2022

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

19 Dec 2021

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

30 Nov 2021

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు.

18 Nov 2021

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

5 Nov 2021

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి!

25 Oct 2021

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది!

9 Jun 2021

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి.

13 Apr 2021

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి!

23 Feb 2021

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది!

14 Dec 2020

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

15 Oct 2020

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు?

6 Jun 2020

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి!

3 May 2020

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి!

25 Apr 2020

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

12 Apr 2020

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి!

1 Mar 2020

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి.

28 Feb 2020

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి!

24 Feb 2020

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

12 Feb 2020

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది!

9 Feb 2020

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము.

8 Feb 2020

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి!