Alt TikTok అంటే ఏమిటి?
మార్గదర్శి (గైడ్)

Alt TikTok అంటే ఏమిటి?

ప్రచురించబడిందిOct 15 2020
వ్రాసిన వారుAngelica
TikTok సెప్టెంబరు 2016లో ఆవిష్కరించబడింది, అప్పటి నుండి అది అత్యధిక స్థాయిలో ప్రజాదరణ పొందింది. మరీ ముఖ్యంగా ఇటివలే కరోన మహమ్మారి తెచ్చిపెట్టిన కఠినతర లాక్‌డౌన్ల సమయంలో. ఏదేమైనా, ఇప్పుడు ఈ మొత్తం మోజులో పడి తాజా తాజా ట్రెండ్లలో చిక్కుకున్నామని జనం అనుకుంటున్న సమయంలోనే, Alt TikTok లాంటి కొత్త పదాలు ట్రెండింగ్‌అవ్వడం ప్రారంభమైయ్యాయి. ఈనాడు స్నేహితులని కలిసి, "నువ్వు TikTokలో ఏ వైపు?" అని అడగడం సర్వసాధారణం, ఎంతో మంది జనాలని ఈ రకంగా అయోమయానికి గురిచేయడం జరుగుతోంది. నిజానికి ఎక్కువ మంది జనం Straight TikTok గా పిలవబడే మెయిన్‌స్ట్రీమ్ TikTokలో వున్నారు. TikTokకి ఇంకోవైపుని Alt TikTok అని పిలుస్తారు. అది ఆల్టర్నేటివ్ TikTok అనే దానికి సంక్షిప్త రూపం. Alt TikTokకి వేరే ప్రత్యేకమైన TikTok యాప్ అవసరం లేదు; మనకి తెలిసిన TikTok యాప్‌నే ఇది ఉపయోగిస్తుంది.
TikTok యొక్క ఈ రెండు వైపుల మధ్య వున్న వ్యత్యాసం ఏమిటి?
అందరికీ తెలిసిన విధంగా, నాట్య నైపుణ్యాలను, ప్రచారానికి ఎక్కే విషయాలను, మరియు వివిధ అంశాలపై అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ప్రజలు Straight TikTokని ఉపయోగిస్తారు. హాస్యభరితమైన, పెదాలు కలిపే నటనను సృష్టించడానికి కొందరు జనం దీనిని ఉపయోగిస్తారు. మరిన్ని వీక్షణలు, లైకులు మరియు సబ్‌స్క్రిప్షన్లను సంపాదించడానికి Straight TikTok వీడియో క్రియేటర్లు అందంగా వుండటం, సాధారణంగా అభిరుచి కలిగిన నైపుణ్యాలని ప్రదర్శించడం మరియు విశేషతలను కలిగివుండటం కొత్త విషయమేమీ కాదు.
సాధారణంగా Straight TikTokలో కనిపించని కంటెంట్‌ని జనం వీక్షించడం మరియు షేర్ చేయడం చేస్తారు కాబట్టి Alt TikTok ప్రత్యేకమైనది. ఇది ప్రతీ ఒక్కరి కోసం కాదు, దీనిని ప్రత్యేకంగా మలుస్తూ, కేవలం దీనికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇందులో వుంటారు. ఇందులో షేర్ చేసే కంటెంట్ మరింత అధివాస్తవికంగా, వ్యంగ్యంగా, పూర్తిగా నల్ల హాస్యంతో కూడి (డార్క్ హ్యూమర్), అసంగతంగా మరియు కళాత్మకంగా వుంటుంది. ఈ రకమైన హాస్యం Straight TikTokలోని జనం ద్వారా మెప్పు పొందదు, అంతేకాదు వారిని అయోమయానికి గురి చేసే అవకాశం కూడా వుంది.
నిజానికి Alt TikTokలో వుండే వాళ్ళు TikTokలో వుండే కంటెంట్‌ని నిరుత్సాహకరమైన కంటెంట్‌గా భావిస్తారు. Alt TikTok ఎంతో అనుకూలమైనది మరియు కంటెంట్ క్రియేటర్ల యొక్క రూపురేఖలు, నమ్మకాలు లేదా ధోరణులతో సంబంధం లేకుండా ఆసక్తికరమైన, వినోదకరమైన మరియు అపూర్వమైన కంటెంట్‌ని మరింత స్వాగతించే విధంగా వుంటుంది. ఆ విధంగా ఇది ప్రజలకి వారి అందచందాల ఆధారంగా కాకుండా వారి హాస్యాస్పద శైలి కారణంగా పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చి పెడుతుంది. ఇది మెయిన్‌స్ట్రీమ్ TikTokతో పోలిస్తే తక్కువ గుర్తింపుని లేదా తక్కువ ప్రజాదరణని కలిగివుంటుంది, కాని ఎన్నో ప్రజాదరణ పొందిన Straight TikTok వీడియోలన్నీ కూడా Alt TikTok కంటెంట్ నుండి సేకరించిన ధ్వని లేదా వీడియో క్లిప్పులను కలిగివుంటాయి.
ఒకే TikTok యాప్ యొక్క భిన్నమైన ఈ రెండు వైపులలోకి ప్రజలు ఎలా వచ్చి చేరుతారు?
డిఫాల్టుగా TikTok ప్రతీ ఒక్కరినీ Straight TikTokలోకే చేరుస్తుంది. కాని ఒక వేళ అల్గారిథం ఏదైనా ప్రత్యేకమైన ఆసక్తిని గుర్తిస్తే కొందరిని మాత్రం Alt TikTokలోకి చేరుస్తుంది. Alt TikTokలోకి వెళ్ళడానికి మీరు చేయగలిగిన కొన్ని చర్యలను చూద్దాం. దీనిని ప్రారంభించాడానికి గొప్ప మార్గం ప్రజాదారణ పొందిన TikTok వీడియోలలో మీయొక్క నిమగ్నతని తగ్గించడం. ఆ విధంగా మీరు ప్రత్యేకమైన, అయినా కూడా ఆసక్తిని కలిగించే కంటెంట్‌తో వ్యవహరించాలి. మీరు వీడియోలపై కామెంట్లు పోస్టు చేయవచ్చు, Alt TikTok వీడియో క్రియేటర్లను అనుసరించి, ఒక Alt TikTok వీడియో చూసిన తరువాత స్వీకరించే వీడియో సూచనలను గమనించవచ్చు. #alttok, లేదా #altTikTok హ్యాష్ ట్యాగులతో మీరు వీడియోల గురించి కూడా వెతకవచ్చు.
కొన్ని Alt TikTok వీడియోలు ఈ హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించవు. అవి #beantiktok, #makka, #pakka, #retail arguments, #shek TikTok, #frogs, #carebear, #elitetiktok, #sacrifice లాంటి ఇతర సూచించబడిన హ్యాష్ ట్యాగుల ద్వారా కనుగొనబడవచ్చు.
మీరు వీక్షించిన గత వీడియోలు మరియు వాటితో మీయొక్క నిమగ్నతా స్థాయి ఆధారంగా TikTok మీకు వీడియోలని అందిస్తుంది. ఆ విధంగా, మీరు Alt TikTokలోకి ప్రవేశించినపుడు, మీరు దానిపైనే కొనసాగడానికి అటువంటి వీడియోలలో మీయొక్క నిమగ్నత ఎక్కువగా వుండాలి. Alt TikTok ప్రపంచానికి సుస్వాగతం!
[object Object] from Exolyt
Angelica from Exolyt
ఈ వ్యాసం Angelica ద్వారా రాయబడింది. ఆమె గారు ఎక్జోలైట్‌లో Senior Social Media Manager గా పనిచేస్తున్నారు. ప్రభావశీలులు, విక్రయదారులు వారియొక్క నిమగ్నతని మెరుగుపరుచుకొని వారి ఖాతాల నుండి ఎంతో పొందే విధంగా వారికి Angelica గారు సహాయం చేస్తారు.
7 May 2022

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

4 May 2022

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

14 Apr 2022

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

5 Apr 2022

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ

29 Mar 2022

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటో మరింత చదవండి

14 Mar 2022

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!

24 Jan 2022

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

10 Jan 2022

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

19 Dec 2021

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

30 Nov 2021

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు.

18 Nov 2021

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

5 Nov 2021

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి!

25 Oct 2021

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది!

9 Jun 2021

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి.

13 Apr 2021

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి!

23 Feb 2021

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది!

14 Dec 2020

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

6 Jun 2020

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి!

3 May 2020

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి!

25 Apr 2020

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

12 Apr 2020

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి!

1 Mar 2020

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి.

28 Feb 2020

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి!

24 Feb 2020

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

12 Feb 2020

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది!

9 Feb 2020

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము.

8 Feb 2020

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి!