ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?
మార్గదర్శి

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ప్రచురించబడిందిJan 24 2022
వ్రాసిన వారుParmis
ఏ రకమైన ప్రకటనల కొరకైనా టిక్‌టాక్ అనేది ఉత్తమ ప్రదేశాలలో ఒకటిగా అవతరిస్తోంది; తన విశేషమైన ప్రయోజనాలతో ఎంతో మంది కీర్తి గడించేలా వారికి సహాయం చేసిన రాబోయే పెద్ద సోషల్ మీడియా వేదిక ఇది. పేరు గడించిన మరియు కొత్తగా పుట్టుకొచ్చిన ఎన్నో వ్యాపార సంస్థలు వాటి యొక్క ఉత్పత్తులు మరియు సేవల వైపు ప్రజల యొక్క దృష్టిని మరింతగా ఆకర్షించడానికి టిక్‌టాక్‌ని ఉపయోగించుకున్నాయి. విస్తృతమైన ప్రేక్షకులని ఆకర్షించడానికి మీయొక్క వ్యాపారం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే, అది నిజంగా అవివేకమే అవుతుంది. ఈ విధంగా, ఒక చిన్న బ్రాండ్ స్థానంలో వున్న మీరు టిక్‌టాక్ నుండి ఎలా ప్రయోజనం పొందాలో తెలిపే ఎక్సోలైట్ యొక్క పూర్తి పరిశోధనని మిస్ అవ్వకండి.
ఒక చిన్న వ్యాపారంగా వున్న మీరు టిక్‌టాక్‌ నుండి ప్రయోజనం పొందడానికి గల కారణాలు.
చిన్న మరియు తరచుగా వినోదాత్మకమైన వీడియోలని షేర్ చేయడం ప్రారంభించిన వేదికనే టిక్‌టాక్ వేదిక. ఇప్పుడు ఇది అత్యంత ప్రముఖమైన సోషల్ మీడియా వేదికలలో ఒకటి. మెయిన్‌స్ట్రీమ్ సోషల్ మీడియాలో టిక్ యొక్క అవతరణ సరికొత్త బ్రాండ్లకి ఒక గొప్ప అవకాశం. అంతేకాదు, ఈ యాప్‌లో ఉనికిని కలిగివుండటం వలన ఎంతో మంది అనుకోని ఫలితాలను పొందుతున్నారు. ఈనాడు, బ్రాండ్లు అనేవి వాటి యొక్క ప్రకటనా కార్యక్రమాలలో మరింత సృజనాత్మకంగా మారుతున్నాయి. మీయొక్క వ్యాపారం టిక్‌టాక్ నుండి ఎందుకని ప్రయోజనం పొందగలదో ఇక్కడ చూడండి:
1. మరింత మందికి వేగంగా చేరువ.
ఈ యాప్ 2016లో ప్రారంభమైనప్పటికీ కూడా, యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లేలో ఈ యాప్ రెండు వందల కోట్ల కన్నా ఎక్కువ సార్లు డౌన్‌లోడ్‌ అయ్యింది.
ప్రస్తుతం 33 మిల్లియన్ డౌన్‌లోడ్‌ల కన్నా ఎక్కువ డౌన్‌లోడ్‌లతో టిక్‌టాక్‌ యాపిల్ యొక్క ఐ.ఓ.ఎస్ యాప్ స్టోర్‌లో అత్యంత డౌన్‌లోడ్ అయిన యాప్‌గా వుంది. స్నాప్‌చాట్‌, పింటరెస్ట్, లేదా ట్విట్టర్ లాంటి ఇతర ఇటీవలి వేదికల కంటే కూడా ఈ టిక్‌టాక్‌ వేదికని ముందు వుంచేది ఈ అంశమే. కంటెంట్ మాత్రమే రాజుగా నిరూపితమైన ఈరోజుల్లో ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమేం కాదు. ఒకే ఒక విషయంలో టిక్‌టాక్‌నైపుణ్యాన్ని కలిగివుందంటే మాత్రం, అది తన వీడియో కంటెంట్‌లో మాత్రమే.
2. టిక్‌టాక్‌ యొక్క ప్రేక్షకులు అంతర్జాతీయం.
టిక్‌టాక్‌ 150 కన్నా ఎక్కువ దేశాలలో లభించగలదు. ఈ వేదికలోని వైరల్ వీడియోలని ప్రపంచవ్యాప్తంగా వీక్షించవచ్చు. కొత్త మార్కెట్లకి చేరువ అవ్వాలని గనుక మీరు కోరుకొంటూ వుంటే, అంతర్జాతీయ ప్రేక్షకులతో సంబంధం పెంచుకోవడానికి టిక్‌టాక్‌ ఒక శక్తివంతమైన వేదిక కాగలదు.
3. అపరిమిత ఇన్‌ఫ్లూయెన్సర్లకి ప్రవేశం.
వైరల్ అయ్యే సామర్థ్యం కలిగివుండటమే టిక్‌టాక్‌లోని అత్యంత ఆకర్షణీయమైన ఫీచరు. అసలు పూర్తిగా అనుచరులు లేని మరియు పూర్తిగా వీక్షణలు లేని వారు సైతం ఒక టిక్‌టాక్‌ క్లిప్‌ని పోస్టు చేస్తే, అది ఒకే ఒక రాత్రిలో పదిలక్షల వీక్షణలని సంపాదించగలదు. ఎవరికైనా గొప్ప సంఖ్యలో అనుచరులని అందించే సామర్థ్యం టిక్‌టాక్‌ కలిగివుండటమంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌ల లభ్యతలో కొరత లేదని దానర్థం. కావలసినవన్నీ కలిగివుండి, ఎక్కువ అనుచరులని కలిగివున్న సరైన వ్యక్తిని కనుగొనడం ద్వారా మీయొక్క బ్రాండ్ ఒక నిర్థిష్టమైన ప్రజా సమూహాలని,ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో లక్ష్యంగా చేసుకొనగలదు.
తమ బ్రాండ్ మీద అవగాహనని పెంచుకోవడానికి లేదా అమ్మకాల్ని సృష్టించడానికి మార్కెటర్లలో దాదాపు 85% వరకూ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌ను వాడుకున్నారని ఇటీవలి డేటా చూపుతోంది. మీ ప్రోడక్టు కొరకు సరైన ఇన్‌ఫ్లుయెన్సర్‌లను లేదా సర్వీసుని కనుగొనడం కష్టతరం కావొచ్చు. టిక్‌టాక్‌ యూజర్లని కనుగొని వారితో భాగస్వామ్యం చేసేలా ఎక్జోలైట్ యొక్క విశ్లేషణనల వేదిక బ్రాండ్లకి సాయం చేస్తుంది. ఇన్‌ఫ్లుయెన్సర్‌ల యొక్క చేరిక, నిమగ్నత, గణాంకాలు, వీక్షణలు, మరియు ఇతర కొలమానాలలోకి మీరు ప్రవేశం పొందవచ్చు.
ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలని చూడడం కూడా గుర్తుంచుకోండి!
4. కంటెంట్‌ని మరొక కారణం కొరకు ఉపయోగించుకునే సాధ్యత.
టిక్‌టాక్‌ వీడియోలని 60 సెకన్లకి కుదించడం వీలవుతుంది. ఈ వీడియోలు చిన్నవి మరియు స్వంత ఉపయోగం కొరకు సవరించదగినవి. మీయొక్క అన్ని మీడియా చానళ్ళన్నింటిలో వాటిని తిరిగి ఉపయోగించడం కూడా వీలవుతుంది.
మీయొక్క టిక్‌టాక్‌ వీడియోలలో ఒకదానిని ఒక ఈమెయిల్‌కి జోడించడమనేది మీయొక్క వినియోగదారులకి ఎంత మంచి పని చేస్తాయో మరియు భవిష్యత్తు ఈమెయిళ్ళ గురించి వారి ఉత్సుకతని ఎలా పెంచుతాయో ఆలోచించండి.
అనేక వేదికలలో మీరు మీయొక్క సంఘాన్ని నిర్మించడాన్ని కొనసాగించుకోవాలనుకుంటే, మీయొక్క టిక్‌టాక్‌ వీడియోని నేరుగా మీయొక్క ఇన్‌స్టాగ్రామ్ నుండే పంపించవచ్చు. అది మీయొక్క వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసుకోవచ్చు లేదా ప్రెజెంటేషన్స్‌లో మరియు ఆన్‌బోర్డింగ్‌ వీడియోలలో కూడా ఉపయోగించవచ్చు. మీరు ఎంత సృజనాత్మకంగా వుంటే, అన్ని అవకాశాలన మీరు చేజిక్కించుకుంటారు.
మీరు అన్ని చానళ్ళలో కూడా అదే సందేశాన్ని చెబుతున్నారని నిర్థారించుకోండి. వినోదాత్మకమైన కంటెంట్ కొరకు టిక్‌టాక్ ఉత్తమమైనది. కానీ, మిమ్మల్ని ఇతర వేదికలలో కలుసుకొనే లేదా మీయొక్క సంస్థ యొక్క వెబ్‌సైట్‌ను సందర్శించే జనాలకి టిక్‌టాక్‌లోని చిత్రాలు మరియు సందేశాలు అయోమయంగా అనిపించవచ్చు.
5. యూజరు యొక్క గొప్ప నిమగ్నత.
టిక్‌టాక్‌ యొక్క వ్యాపార వినియోగంలో నిమగ్నత రేటు అనేది కీలకమైన అంశం. తక్కువ శ్రమకే మీయొక్క వీడియోలలో నిమగ్నతని పెంచుకునే విధంగా ఒక సగటు టిక్‌టాక్‌ యూజరు విశిష్టమైన డెలివరీ అల్గారిథంలను ఖర్చు చేస్తాడు.
6. బడ్జెట్‌కి అనుకూలమైనది
ఎన్నో బ్రాండ్‌లు టిక్‌టాక్‌లో ప్రకటనల కొరకు డబ్బుని ఖర్చు చేయడం గురించి వెనకాడతాయి. ప్రచారాలని నిర్వహించడం మరియు మరొక యాప్ నుండి డేటాని ట్రాక్ చేయడం అతి కష్టంగా ఉంటుందని వారు భయపడతారు. ఏ బడ్జెట్‌తోనైనా విజయవంతమయ్యే సామర్థ్యాన్ని టిక్‌టాక్ కలిగివుండటమే దీనిలో వున్న గొప్ప విషయం.
బాగా స్థిరపడిన వేదికలకి బదులు, తక్కువ ప్రజాదారణ కలిగిన బ్రాండ్‌లు ఎటువంటి డబ్బు ఖర్చు లేని ప్రజా చేరువని సాధించడానికి ఇది చాలా సులభమైన వేదిక.
"నిమగ్నత అనేది ఫేస్‌బుక్‌లో మరీ ఎక్కువ ఖరీదైనదిగా అవుతున్న సమయంలో, మెరుగైన ఎదుగుదల అవకాశాల కొరకు బ్రాండ్‌లు అనేవి పైకి వస్తున్న సోషల్ మీడియా చానళ్ళ ఉపయోగాన్ని పరిశీలించాలి," అని టిన్యూటీ యొక్క పెయిడ్ సోషల్ డైరెక్టరు కేటీ లూసీ అంటారు. మీయొక్క మీడియాని బహుముఖం చేసి ఎక్కువ ఎదుగుదల అవకాశాన్ని కలిగివున్న వేదికలకి వాటిని మళ్ళించడం ముఖ్యం, ఉదాహరణకి టిక్‌టాక్‌ మరియు స్నాప్‌చాట్‌ లాంటి వేదికలు.
మరింత ప్రామాణికంగా కనిపించండి.
మీయొక్క వీడియోలకి సంబంధించి తక్కువ నిర్మాణ విలువల వలన మీయొక్క బ్రాండ్ మరింత ప్రామాణికంగా కనిపిస్తుంది, ఎందుకంటే మెరుగులు దిద్దిన కంటెంట్ కంటే కూడా వాస్తవికంగా వుండే కంటెంట్‌ సులభతరం కాబట్టి. ఎందుకంటే, మెరుగులు దిద్దిన వీడియోలు ప్రకటనల లాగా కనిపిస్తాయి కాబట్టి యూజర్లు వాటిని ఎక్కువగా చూసినపుడు తొలగించే అవకాశం ఉండొచ్చు.
ఇతరులు ఏ కంటెంట్‌ని ఉపయోగిస్తారో దానికి సమానంగా మీయొక్క కంటెంట్ వుండాలి. ఇది ప్రేక్షకులు మీయొక్క బ్రాండ్‌కి దగ్గరగా వున్న భావనని వారికి కలుగజేస్తుంది. అంతేకాదు, మీకు మరియు మీయొక్క వినియోగదారుల మధ్యలో విశ్వాసం పెంచడాన్ ఇది సులభం చేస్తుంది.
కాని గుర్తుంచుకోండి, మీయొక్క టిక్‌టాక్‌ ఖాతాలు ఇంకా కూడా మీ బ్రాండ్‌లో ఒక భాగం. ప్రతీదీ ట్రెండీగా చేయడానికి ప్రయత్నించకండి, మీయొక్క బ్రాండ్ దీనిలో సమానంగా స్థాయిలో లేనప్పటికీ కూడా. మీరు ప్రామాణికంగా కనిపించడానికి ఎంతో ట్రెండీగా మీరు కనిపించవచ్చు.
చిన్న వ్యాపారాలు వృద్ధి పొందడాన్ని టిక్‌టాక్‌ సులభతరం చేస్తుంది.
టిక్‌టాక్‌లోని చిన్న వ్యాపారాల సంభాషణలనేవి బ్రాండింగ్ మరియు సమయ నిర్వహణ నుండి సోషల్ నెట్వర్కింగ్ చిట్కాల వరకూ వ్యాపించి వుంటుంది. నమోదు కావడానికి మీరు చేయాల్సిందల్లా సంభాషణలోకి చేరడమే. ఇక మీరు కొత్త వినియోగదారులని చేరుకోవచ్చు, ప్రోడక్టు అమ్మకాల్ని పెంచుకోవచ్చు, లేదా టిక్‌టాక్‌ కమ్యునిటీతో మీయొక్క వ్యాపారాన్ని ఎలా పెంచుకోవచ్చో నేర్చుకోవచ్చు. ఈ హ్యాష్‌ట్యాగ్‌లు అసాధారణమైన వీక్షణ సంఖ్యని కలిగివుంటాయి. అది చిన్న వ్యాపారాల సంభాషణలు ఈ వేదిక మీద ఎలా వృద్ధి పొందుతున్నాయో మీకు చూపిస్తుంది.
#smallbusiness - 48.4 బిలియన్ వీక్షణలు
#entrepreneur - 17 బిలియన్ వీక్షణలు
#smallbusinesscheck - 12.9 బిలియన్ వీక్షణలు
#sidehustle - 7.9 బిలియన్ వీక్షణలు
#smallbusinesscheck - 4 బిలియన్ వీక్షణలు
#smallbiz - 3.4 బిలియన్ వీక్షణలు
టిక్‌టాక్‌లో చిన్న వ్యాపారాల కొరకు చిట్కాలు
మీయొక్క ఫాలోయింగ్‌ని పెంచుకోవడానికి మేము మీకు ఆచరణాత్మక చిట్కాలు ఇవ్వడానికి ముందు, వేల సంఖ్యలో అనుచరులని కలిగివుండటం కంటే సరైన అనుచరులను కలిగివుండటం మంచిదనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అనుచరులని కొనడమనే ఆలోచన మంచిదేం కాదు. పారదర్శకత లేకపోవడం మరియు ఇది తక్కువ నిమగ్నతని కూడా తెచ్చిపెట్టడమే దీనికి కారణం. సరైన మార్గంలో సరైన ఫాలోయింగ్‌ని గనుక మీరు నిర్మించగలిగితే, బ్రాండ్ రాయబారుల వేదికపై మీరు ఒక సంఘాన్ని నిర్మించవచ్చు.
1వ చిట్కా: తరచుగా పోస్ట్ చేయండి
మీయొక్క ప్రేక్షకులని పెంచుకోవడానికి నిత్యం పోస్టు చేయడం కీలమైనది. ప్రతీ వారానికి కనీసం మూడు సార్లు మీరు పోస్ట్ చేయాలి. కాలక్రమేణా మీ ఫాలోయింగ్‌ని నిర్మించుకోవడానికి ఇది సహకరిస్తుంది.
సులభంగా చెప్పాలంటే, జనం మీయొక్క ఖాతాని అనుసరించినప్పుడు మీరు కంటెంట్‌ని పోస్ట్ చేయాలని ఆశిస్తారు. తరచుగా పోస్టులు చేయకపోవడమనేది అనుచరులని కోల్పోవడానికి దారి తీస్తుంది. మీరు సక్రమమైన మార్గంలో ఉండేలా ఒక కంటెంట్ క్యాలెండర్‌ను సృష్టించండి.
2వ చిట్కా: సరైన సమయంలో పోస్ట్ చేసే విధంగా ఒక సమయ పట్టికను తయారు చేసుకోండి.
మీయొక్క ప్రేక్షకులు టిక్‌టాక్‌లో స్క్రోల్ చేసే సమయాన్ని మీరు పరిశీలించడం చాలా ముఖ్యం. మీయొక్క ప్రేక్షకులు ఆన్‌లైన్‌లో వుండగా పోస్ట్ చేయడం ఉత్తమం. ప్రయాణ సమయాలు, మధ్యాహ్న భోజన సమయం, మరియు పని గంటల తరువాత సమయం, అంతేకాకుండా వారంతాలు అనేవి సోషల్ మీడియాలో పోస్టులు చేయడానికి ఉత్తమమైన సమయాలు.
మీరు ఎవరో మరియు మీయొక్క ప్రేక్షకులు దేని గురించి అన్వేషిస్తున్నారనే దాని మీద, మీరు పబ్లిష్ చేసే ఉత్తమ సమయం ఆధారపడి వుంటుంది. సాధారణంగా ఉత్తమ సమయాలనేవి వారం యొక్క ఒకరోజు నుండి తరువాతి రోజు వరకూ చాలా అరుదుగా కొనసాగుతాయి.
3వ చిట్కా: సరైన హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించండి.
టిక్‌టాక్‌ అనేది తన హ్యాష్‌ట్యాగ్ ఛాలెంజ్‌లకి ప్రసిద్ధి చెందింది. మీయొక్క మార్కెటింగ్ వ్యూహంలో సరైన హ్యాష్‌ట్యాగ్‌లను వాడేలా మీరు చూసుకోవాలి. ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో వాటికి మాత్రమే కాకుండా, మీయొక్క ప్రోడక్టు లేదా బ్రాండుకి కూడా సంబంధించి వుండే హ్యాష్‌ట్యాగ్‌లను ఎంచుకునేలా జాగ్రత్త పడండి.
చిట్కా 4: ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిసి పనిచేయండి.
బాహాటంగా మాట్లాడుకుందాం, మనం ఆదర్శించే వ్యక్తులు నమ్మే ప్రతీదాన్ని మనం నమ్మాలనుకుంటాం. యూజర్లు తమకి ఇష్టమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చెప్పేదాని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సంబంధిత ఇన్‌ఫ్లుయెన్సర్‌లను కనుగొని వారిని స్పాన్సర్ చేయండి. మీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల యొక్క లక్షణాలు అనేవి మీయొక్క వ్యాపార ప్రమాణాలను పోలి వుండటం ముఖ్యం. మీయొక్క సేవలతో అలవాటు లేని ఎవరో ఒక వివాదాస్పద వ్యక్తిని మీరు స్పాన్సర్ చేయడమనేది ఒక దురదృష్టకర నిర్ణయమే అవుతుంది.
5 చిట్కా: మీయొక్క కంటెంట్ గురించి అతిగా ఆలోచించకండి.
చివరి చిట్కా ఏంటంటే మీరు పోస్టు చేసే కంటెంట్ గురించి అతిగా ఆలోచించకూడదు. అది టిక్‌టాక్‌ మార్గదర్శకాలకి అనుగుణంగా వుండాలి, అంతేకాదు ఎటువంటి చట్టాలని కూడా ఉల్లంఘించకూడదు. కానీ, అది యూజర్లకి సంబంధం లేని విధంగా వుండకూడదు. ఆసక్తిగా అనిపించే ప్రతీ దానితో మనుషులు సంభాషిస్తారు. మీయొక్క కంటెంట్ వృత్తిపరంగా ఉండేలా, కానీ మాములుగా విషయానికి సంబంధించి ఉండేలా మీరు జాగ్రత్తపడటాన్ని దృష్టిలో ఉంచుకోండి.
ఎక్జోలైట్‌లో, మేము మీకు ఒక పోటీతత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ వీడియోలు ఎక్కువ వీక్షణలని సంపాదిస్తున్నాయో, ఇతర కంటెంట్ సృష్టికర్తల వాటితో ఎలా పోల్చాలో మరియు సిఫారసులని పొంది నిమగ్నతని ఎలా మెరుగుపరచాలో అర్థం చేసుకొనేందుకు సహకరించే శక్తివంతమైన విశ్లేషణలని మాయొక్క వినూత్నమైన వేదిక మీకు అందిస్తుంది.
వారి యొక్క కంటెంట్‌పై పరిజ్ఞానాన్ని కలిగించడానికి మేము సోషల్ మీడియా ఏజెన్సీలతో, ప్రపంచ బ్రాండ్లతో మరియు ఒంటరిగానే పనిచేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లతో మేము పనిచేస్తాము. ఒక డెమోని బుక్ చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి, లేదా మీయొక్క ఉచిత ట్రయల్‌ని ఈరోజే ప్రారంభించండి!
[object Object] from Exolyt
Parmis from Exolyt
ఈ వ్యాసం Parmis చేత రాయబడింది. ఆవిడ గారు Exolytలో కంటెంట్ సృష్టికర్తగా పనిచేస్తున్నారు. సరికొత్త టిక్‌టాక్‌ ట్రెండ్లతో తనను తాను అప్‌డేట్‌లో ఉంచుకుంటూనే, రాయడంలో మరియు కొత్త విషయాల్ని కనుగొనడంలో ఆమె ఆసక్తిని కలిగివున్నారు.
7 May 2022

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

4 May 2022

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

14 Apr 2022

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

5 Apr 2022

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ

29 Mar 2022

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటో మరింత చదవండి

14 Mar 2022

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!

10 Jan 2022

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

19 Dec 2021

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

30 Nov 2021

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు.

18 Nov 2021

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

5 Nov 2021

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి!

25 Oct 2021

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది!

9 Jun 2021

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి.

13 Apr 2021

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి!

23 Feb 2021

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది!

14 Dec 2020

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

15 Oct 2020

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు?

6 Jun 2020

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి!

3 May 2020

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి!

25 Apr 2020

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

12 Apr 2020

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి!

1 Mar 2020

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి.

28 Feb 2020

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి!

24 Feb 2020

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

12 Feb 2020

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది!

9 Feb 2020

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము.

8 Feb 2020

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి!