టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?
మార్గదర్శి

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

ప్రచురించబడిందిOct 25 2021
వ్రాసిన వారుParmis
టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి - ఒకేఒక వ్యాపార గైడ్
ఎవరైనా సరే వెలుగులోనికి రావడానికైనా మరియు మార్కెటింగ్ కొరకైనా టిక్‌టాక్‌ అనేది అత్యుత్తమ సాధనాల్లో ఒకటిగా మారుతోందనే విషయం పెద్ద రహస్యమేం కాదు. వేగంగా పెరుగుతున్న ఒక మార్కెట్‌ని టిక్‌టాక్‌అందిస్తోంది. అది ఒక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సరైన వాతావరణాన్ని అందిస్తుంది. కాబట్టి, మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నా లేదా మీరు ఇది వరకే కలిగివున్న వ్యాపారాన్ని పెంపుదల చేసుకోవాలనుకుంటున్నా, మీరు మమ్మల్ని అనుసరిస్తూనే వుండండి.
వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి టిక్‌టాక్‌ని ఎందుకని ఉపయోగించాలి?
ఒక వ్యాపార సందర్భంలో ప్రమోషన్ యొక్క ఎప్పుడూ వుండే మార్గం అనేది బహుశా వృత్తిపరమైన వేదికల పైన ఇచ్చే ప్రకటనల ద్వారా వుంటుంది. ఇది ఇప్పటికీ కూడా నిజమే, కాని మీరు గనుక విస్తృత స్థాయిలో ప్రేక్షకులని చేరుకోవాలంటే, కేవలం సామాజిక మాధ్యమమే మీరు ఎంచుకోదగిన మార్గం. మీరు ప్రమోషన్లలో పాల్గొన్నప్పటికీ మాములుగా మరియు ఆ విషయానికి సంబంధించిన విధంగా మీరు కనిపించే వాతావరణాన్ని టిక్‌టాక్‌అందిస్తోంది. ఎలా అని అడగకండి! ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, టిక్‌టాక్‌లో మీయొక్క వ్యాపారాన్ని పెంచుకునే చిట్కాలని చూద్దాం పదండి:
టిక్‌టాక్‌పైన ఒక వ్యాపారాన్ని పెంచుకునే చిట్కాలు
1) సరైన హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించండి
హ్యాష్‌ట్యాగ్‌లు మీయొక్క పోస్టు అనేది విస్తృతమైన ప్రేక్షకులకి చేరేలా మీకు సహకరిస్తుంది. అది మీ వ్యాపార గుర్తింపు అవకాశాలను పెంచుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, హ్యాష్‌ట్యాగ్‌లు మీరు లక్ష్యంగా చేసుకున్న ప్రేక్షకులని సులభంగా చేరుకునేలా మీకు సహకరిస్తుంది. ఈ క్రిందివి టిక్‌టాక్‌లో ఎక్కువగా వాడే యాష్‌ట్యాగ్‌లు.
#టిక్‌టాక్
#foryoupage
#foryou
#fyp
#viral
తరువాతి స్టెప్ ఏమిటంటే మీరు ఏ ప్రత్యేకమైన యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించాలి అని నిర్ణయించుకోవడమే, ఇది మీయొక్క వ్యాపారం మీద ఆధారపడి వుంటుంది. మీరు దేన్ని అమ్ముతున్నారో లేదా ఏ సేవలను మీరు అందిస్తున్నారో ఈయొక్క యాష్‌ట్యాగ్‌లు తెలపాల్సి వుంటుంది. ఈ క్రింది ఉదాహారణలను చూడండి:
Artists
Candle business
Mental Health Organisations
#artwork
#handmade
#motivation
#artist
#candle
#recovery
#illustration
#decor
#psychology
#sketch
#waxmelts
#wellness
#design
#candleaddict
#therapy
#artwork
#candlemaking
#selfcare
#contemporaryart
#soywax
#mentalillness
2) ట్రెండ్లని అందిపుచ్చుకోండి
"టిక్‌టోకర్‌లు" ఇష్టపడే విషయం ఏదైనా ఉందంటే, అది ట్రెండ్‌లు మాత్రమే; ఆహ్లాదకరమైన ట్రెండ్లను చూసి భయపడవద్దు, అంతేకాదు, మీ ఖాతాను ప్రచారం చేయడానికి వాటిని ఉపయోగించుకోండి. ప్రచారం కోసం ఇప్పటికీ ఉపయోగించే కొన్ని ట్రెండ్‌లు ఇక్కడ ఉన్నాయి:
నేను ఎక్కువగా ఎదురుకునే ప్రశ్నలు
మీయొక్క వ్యాపారం గురించిన స్పష్టతని అందించడానికి వుండే ఉత్తమ మార్గాలలో ఈ ట్రెండ్ ఒకటి. ఇది ఒక ఆహ్లాదకరమైన నృత్య అంశాన్ని కలిగివుండి, చెప్పాల్సిన అంశాన్ని ప్రేక్షకులకి చక్కగా చేరవేస్తుంది; కొన్ని ప్రశ్నలని మరియు జవాబులని సందర్శించండి.
ఈ ట్రెండ్ యొక్క ఉదాహరణలని పరీశీలించండి
మీరు ఎక్కడి నుండి వచ్చారో చూడండి
ఏదో ఒక ఆకర్షించే పాటలా కాకుండా, మీయొక్క వ్యాపారం ప్రస్తుతం వున్న స్థాయికి ఎలా చేరిందో చూపడానికి ఈ ట్రెండ్ ఒక అత్యుత్తమ మార్గం. ఇది ప్రేక్షకుడిలో సానుభూతి మరియు భావోద్వేగాలను కలిగించే అవకాశం కూడా వుంది. ఇందులోకి వెళ్ళి మీయొక్క ప్రయత్నాన్ని మరియు లక్ష్యాలను చూపించండి!
ఈ ట్రెండ్ యొక్క పూర్తి పాటని పరిశీలించండి
ఒక వేలిని క్రిందికి దించండి
యూజరుతో సంభాషణకి సంబంధించి ఈ ట్రెండ్ ఒక అత్యుత్తమ మార్గం. అవును/కాదు అనే ఒక ప్రశ్నల జాబితాని తయారు చేసి ప్రేక్షకులని వాటికి గుడ్డిగా స్పందించమని అడగండి.
ఈ ట్రెండ్‌కి సంబంధించిన ఉదాహరణని పరిశీలించండి
3) చిన్న వీడియోలను సృష్టించండి
మూడు నిమిశాల వరకూ నిడివి గల వీడియోలను తయారు చేసుకోవడానికి టిక్‌టాక్‌అవకాశాన్ని కల్పిస్తోంది. ఏదేమైనప్పటికీ, విశ్లేషణల ప్రకారం, పొడవైన వీడియోల విషయంలో యూజర్లు ఆసక్తి కోల్పోయే అవకాశం ఎక్కువగా వుంది కాబట్టి వీడియోలను తక్కువ నిడివితో తయారు చేయడమనేది ఉత్తమం. ఎక్కువ వీక్షణలని పొందడానికి ఎక్కువ శాతం వీడియోలు 15 సెకన్ల నిడివితో ఉండేలా ప్రయత్నించండి.
4) ఇన్‌ఫ్లూయెన్సర్లతో పని చేయండి.
కొంచెం నిజాయితీగా ఉందాం; మనం ఆదర్శించే వ్యక్తులు చెప్పే ప్రతీదీ మనం నమ్మాలనుకుంటాం. కాబట్టి, తమకి ఇష్టమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ప్రోత్సహిస్తున్న వాటిలో యూజర్లు నిమగ్నమవడం అనేది పెద్ద రహస్యమేమీ కాదు. సంబంధిత ఇన్‌ఫ్లుయెన్సర్‌లను కనుగొని వారిని స్పాన్సర్ చేయండి. ఆ ఇన్‌ఫ్లూయెన్సర్‌ యొక్క లక్షణాలనేవి మీయొక్క వ్యాపార ప్రమాణాల నుండి మరియు సేవల నుండి దూరంగా ఉండకుండా చూసుకోండి. మీరు అందిస్తున్న సేవల గురించి ఏమీ తెలియని ఒక వివాదాస్పద ఇన్‌ఫ్లుయెన్సర్‌ను మీరు స్పాన్సర్ చేయకూడదు; కాబట్టి, తగినంత పరిశోధన చేయండి!
5) టిక్‌టాక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయండి
టిక్‌టాక్‌ లైవ్‌లను ఉపయోగించుకోవడమే ఒక ప్రోడక్టుని ప్రదర్శించడానికి వున్న అత్యుత్తమ మార్గాలలో ఒకటి. అమ్మకందారుని వెబ్‌సైట్‌కి వెళ్ళకుండా నేరుగా టిక్‌టాక్‌నుండే కొనుగోలు చేసేలా టిక్‌టాక్‌ ఇటీవలే ఒక షాపింగ్ ఫీచరుని జోడించింది. కొన్ని చిన్న వ్యాపారాలు ఈయొక్క మార్గాన్ని ఉపయోగించుకొని వారి యొక్క ఉత్పత్తులను టిక్‌టాక్‌లో స్క్రోల్ చేస్తూ వుండే యూజర్లకి చూపించడం ప్రారంభించాయి. లైవ్ స్ట్రీమింగ్‌ని వీక్షించే ప్రజలని మీయొక్క సంస్థ యొక్క వెబ్‌సైట్‌కి మళ్ళించి విశ్లేషణలను కూడా పెంచుకోవచ్చు.
6) మీ కంటెంట్ గురించి అతిగా ఆలోచించవద్దు
చిట్టచివరి చిట్కా ఏంటంటే మీరు పోస్ట్ చేసే కంటెంట్ గురించి అతిగా ఆలోచించకపోవడమే; అవన్నీ కూడా టిక్‌టాక్‌ మార్గదర్శకాలతో సరిపోతున్నాయని మరియు ఎటువంటి చట్టాలను ఉల్లంఘించడంలేదని నిర్ధారించుకోండి. అంతేకాదు, యూజర్లకి అసలు సంబంధం లేని వీడియోలని సృష్టించకండి. తమకి సంబంధించిన ప్రతీదానితో మానవులు ప్రతిస్పందిస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకొని, ఒక మామూలు మరియు ప్రేక్షకులకి సంబంధించిన పద్దతిలో వృత్తిపరమైన శైలిలో మీయొక్క కంటెంట్ సమర్పించబడేలా నిర్ధారించుకోండి.
ఎక్జోలైట్‌లో మేము మీకు ఒక పోటీతత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ వీడియోలు ఎక్కువ వీక్షణలని సంపాదిస్తున్నాయో, వాటిని ఇతర కంటెంట్ సృష్టికర్తలతో ఎలా పోల్చుకోవాలో మరియు సిఫారసులని పొంది నిమగ్నతని ఎలా మెరుగుపరచాలో అర్థం చేసుకొనేందుకు సహకరించే శక్తివంతమైన విశ్లేషణలని మాయొక్క వినూత్నమైన వేదిక మీకు అందిస్తుంది.
[object Object] from Exolyt
Parmis from Exolyt
ఈ వ్యాసం Parmis చేత రాయబడింది. ఆవిడ గారు Exolytలో కంటెంట్ సృష్టికర్తగా పనిచేస్తున్నారు. సరికొత్త టిక్‌టాక్‌ ట్రెండ్లతో తనను తాను అప్‌డేట్‌లో ఉంచుకుంటూనే, రాయడంలో మరియు కొత్త విషయాల్ని కనుగొనడంలో ఆమె ఆసక్తిని కలిగివున్నారు.
7 May 2022

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

4 May 2022

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

14 Apr 2022

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

5 Apr 2022

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ

29 Mar 2022

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటో మరింత చదవండి

14 Mar 2022

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!

24 Jan 2022

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

10 Jan 2022

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

19 Dec 2021

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

30 Nov 2021

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు.

18 Nov 2021

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

5 Nov 2021

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి!

9 Jun 2021

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి.

13 Apr 2021

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి!

23 Feb 2021

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది!

14 Dec 2020

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

15 Oct 2020

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు?

6 Jun 2020

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి!

3 May 2020

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి!

25 Apr 2020

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

12 Apr 2020

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి!

1 Mar 2020

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి.

28 Feb 2020

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి!

24 Feb 2020

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

12 Feb 2020

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది!

9 Feb 2020

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము.

8 Feb 2020

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి!