టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి
మార్గదర్శి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

ప్రచురించబడిందిNov 05 2021
వ్రాసిన వారుParmis
రోజులు గడిచే కొద్దీ, మరింత మంది వాడకందారులు మరియు వ్యాపారస్తులు వారి యొక్క వేదికలను పెంచుకునే ఆశతో టిక్‌టాక్‌లో చేరతారు. ప్రజాదారణని పెంచుకోవడానికి అత్యుత్తమ వేదికలలో ఒకటిగా టిక్‌టాక్‌ అవతరించింది; కాని, మిగతావారు కూడా మీరు ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నారో బహుశా వాటి గురించే ఆలోచిస్తూ వుంటారు. అందుకనే మీరు ఈ వ్యాసాన్ని చదవాలి. టిక్‌టాక్‌లోని మిగతా పోటీదారులతో మిమ్మల్ని మీరు ఎలా పోల్చుకోవాలో తెలిపే గైడ్ ఇది.
మీయొక్క ఖాతాని మీ పోటీదారుల ఖాతాలతో పోల్చే విధంగా మీరు పాఠించాల్సిన కొన్ని దశలు వున్నాయి.
స్టెప్ 1: మీ పోటీదారుల గురించి తెలుసుకోండి
దేని పైన మీయొక్క టిక్‌టాక్‌ ఖాతా దృష్టి పెట్టిందో మరియు మీయొక్క అంశం ఎంత విస్తృతంగా వుందో అనేదానిపైన ఆధారపడి మీయొక్క పోటీదారులు మారుతూ వుంటారు. మీయొక్క ఖాతా "క్రిప్టోకరెన్సీ"కి సంబంధించినదైతే, ఈ అంశం కొంచెం ఎక్కువ చర్చనీయాంశం కాబట్టి మీరు ముందుగా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది పోటీదారులనే మీరు కలిగివుండవచ్చు. సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లు మరియు ఖాతాలను వెతకడం ద్వారా మీరు సులభంగా మీయొక్క పోటీదారులని కనుగొనవచ్చు.
స్టెప్ 2: గణాంకాలను మరియు వాస్తవాలను విశ్లేషించండి.
ఇప్పుడు మీరు మీయొక్క పోటీదారులతో అలవాటయ్యారు కాబట్టి, వారి యొక్క అనుచరులని మరియు వీక్షణల లెక్కని పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలని విశ్లేషించే సమయం ఇది:
విస్తృతమైన ప్రేక్షకులని వారు కలిగివున్నారా?
మీతో పోల్చినపుడు వారు ఎక్కువ వీక్షణలని పొందుతున్నారా?
మీరు కూడా ఆ ప్రేక్షకులనే లక్ష్యంగా చేసుకున్నారా?
ఈ ప్రశ్నలు మరియు ఇతర సంబంధిత విషయాలన్నీ కూడా మీరు మీయొక్క పోటీదారున్ని విశ్లేషించి మీరు మరియు మీయొక్క పోటీదారుడు ఒకే శ్రేణిలో వున్నారో లేదో నిర్ధారించుకునేలా మీకు సహకరిస్తుంది. పెద్ద పోటీదారులతో పోటీకి దిగడం చెడ్డ విషయమేం కాదు, కానీ ఒకసారి ఒకే యుద్దాన్ని ఎదురుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి; అధిక స్థాయి శ్రేణిలోకి ప్రవేశిస్తూ అపజయాల రేటు తక్కువగా ఉండేలా చూసుకోండి.
ఎక్జోలైట్ అందిస్తున్న పోలిక సాధనాన్ని ఉపయోగించేలా చూసుకోండి. అది మీ పని మొత్తాన్ని చేసేస్తుంది!
స్టెప్ 3: మీతో పోల్చినపుడు వారి యొక్క మొత్తం పనితీరు ఎలా వుందో విశ్లేషణ చేయండి.
ఇప్పుడు మీరు మీయొక్క పోటీదారులతో సుపరిచితులయ్యారు కాబట్టి, వారి యొక్క శ్రేణిపై అవగాహన కలిగింది కాబట్టి, మరియు మీరు వారితో ఎలా పోలిక చేయాలో తెలిసింది కాబట్టి, ఇక ఇప్పుడు మీరు వారి యొక్క మొత్తం పనితీరుని విశ్లేషణ చేయాల్సిన సమయం. ఈ స్టెప్ కొరకు ఈ క్రింది మార్గదర్శకాలని అనుసరించండి:
1) వారి వీక్షణలని మీయొక్క వీక్షణలతో పోల్చండి
ప్రచార (పబ్లిసిటి) రేటు ఎలా వుంది? మరిన్ని వీక్షణలని సంపాదించడానికి వారేమైనా చేస్తున్నారా?
2) వారి యొక్క కంటెంట్ పైన వారు సాధారణంగా ఎన్ని లైకులు సాధిస్తున్నారో తనిఖీ చేయండి.
లైకులు అనేవి ఎప్పుడూ కూడా వీక్షణల కంటే ఎంతో తక్కువగా వుంటాయి, కాని ప్రేక్షకుల యొక్క ఆసక్తిని ఏది రేపుతుందో తెలిపే గొప్ప సూచనలు అవి.
3) వారి యొక్క ప్రేక్షకులకి సంబంధించి ఏ రకమైన కంటెంట్ ప్రముఖమైనదో విశ్లేషించండి.
పోటీదారుని యొక్క ఖాతా పైన పోస్టింగ్ నమూనాని గమనించడం ద్వారా ఈ పనిని పూర్తి చేయవచ్చు. ఎందుకంటే, వారికి ఏది పనిచేస్తూ వుందో దానినే వారు పోస్ట్ చేస్తారు కాబట్టి; ఒకవేళ అది ఒక సిరీస్ కావచ్చు లేదా ప్రోడక్టు రివ్యూలు కూడా కావొచ్చు.
4) విస్తృతమైన ప్రేక్షకులని చేరుకోవడానికి వారు ఉపయోగించే వ్యూహాలను మీరు రాసుకోండి.
కంటెంట్‌ని మూడు విభాగాలుగా విభజించి వాటిని వేరువేరుగా పోస్టు చేయడమనేది దీనికి ఒక ఉదాహరణ. ఇది ప్రేక్షకుల యొక్క నిమగ్నతని మరియు జిజ్ఞాసని పెంచుతుంది. కాని దీన్ని మరీ ఎక్కువగా చేయకుండా జాగ్రత్త పడండి.
5) వారి యొక్క వినియోగదారులు దేని వైపు ఆకర్షితం అవుతున్నారో పర్యవేక్షించండి.
ప్రచారం విషయానికొస్తే, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అంశం పైన క్షుణ్ణంగా పరిశోధన చేయండి. ఇదొక నిర్దిష్ట రకమైన కంటెంటా? భాగస్వామ్యమా? ఒక ట్రెండా? ఒక వీడియో యొక్క ఒక ప్రత్యేకమైన నిడివా?
టిక్‌టాక్‌లో పోటీదారులపై గెలవడానికి మార్కెటింగ్ చిట్కాలు.
చిట్కా #1: విశిష్టమైన కంటెంట్‌తో మీ ప్రేక్షకులని ఆకర్షించండి.
కొందరు చెబుతున్నట్లుగా, కొత్తగా వుండండి, ఎదో కొత్త విషయాన్ని సృష్టించడంలో మరియు ట్రెండ్లను సెట్ చేయడంలో సిగ్గుపడకండి. టిక్‌టాక్‌లోని యూజర్లు కొత్తగా వచ్చే విషయాల పట్ల ఆకర్షితం అవుతున్నట్లుగా మరియు దానికి వారు వేగంగా అనుకూలతను చూపిస్తున్నారని నిరూపించబడింది.
మీయొక్క ఖాతా ద్వారా స్క్రోల్ చేస్తూ వెళ్ళే ఎవరి దృష్టినైనా వెంటనే ఆకర్షించే కంటెంట్‌ని సృష్టించండి. టిక్‌టాక్‌అందించే వివిధ రకాల ఫీచర్లన్నింటినీ ఉపయోగించుకొని సృజనాత్మకతని పొందండి!
చిట్కా #2: నిరంతరం కంటెంట్‌ని అప్లోడ్ చేయడానికి ఒక షెడ్యూల్‌ని అమలుపరచండి.
నిరంతర అప్లోడ్ షెడ్యూల్‌ని పాటించండి మరియు ప్రతీరోజు మీ ప్రేక్షకులకి సరికొత్త కంటెంట్‌ని అందించేలా చూసుకోండి. ఈ ప్రణాళికని కొనసాగించడానికి మరొక చిట్కా ఏంటంటే, ఫలితం నెమ్మదిగా వుండే రోజులలో ఎదో ఒకటి అప్లోడ్ చేయడానికి కంటెంట్‌ని ముందుగానే చిత్రీకరించండి.
చిట్కా #3: ట్రెండ్లని అనుసరించండి మరియు వాటికి సంబంధించినవే చేయండి.
టిక్‌టాక్‌ ప్రేమించే విషయం ఏదైనా వుందంటే, అది నిరంతరం వస్తూ పోయే ట్రెండ్లు మాత్రమే. ఎందుకంటే యూజర్లు ఎప్పుడూ కూడా వీటిని అనుసరిస్తూనే వుంటారు కాబట్టి, తాజా ట్రెండ్లను ఉపయోగించుకోండి.
చిట్కా #4: ఇన్‌ఫ్లూయెన్సర్ల యొక్క ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయకండి.
ఇన్‌ఫ్లుయెన్సర్లు (ప్రభావశీలులు) ఈరోజుల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ పాత్రని పోషిస్తున్నారు. ప్రజలు ఎక్కువ శాతం, ఎక్కువ సందర్భాలలో వారికి ఆదర్శంగా వుండే వ్యక్తులు చెప్పేది నమ్మాలనుకుంటారు; ఈ సమయంలోనే మీరొక స్పాన్సర్షిప్ ఒప్పందంతో ఇందులోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇది మీయొక్క విశ్లేషణలను మెరుగుపరుస్తుంది. ప్రతీ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి తన స్వంత రకమైన ప్రేక్షక వర్గం ఒకటి వుంటుంది; ఏ రకమైన ప్రేక్షకులని లక్ష్యంగా చేసుకోవాలో ఒకసారి మీరు నిర్ణయించుకున్న తరువాత, వారికి సంబంధించిన మరియు తగిన ఇన్‌ఫ్లుయెన్సర్లని మీరు వెతకడం ప్రారంభించవచ్చు.
చిట్కా #5: ఉత్తమమైన వినియోగదారుల సేవలని అందించండి.
తమ ప్రేక్షకులు తమ బాధలతో తమని సంప్రదించేలా వారిని అనుమతించే ఒక వ్యాపారం కంటే గొప్ప వ్యాపారం ఇంకొకటి వుండదు. మీ వినియోగదారుల యొక్క ఇబ్బందులు పరిష్కరించబడే విధంగా ఒక చక్కని వినియోగదారుల సేవా వ్యవస్థని ఏర్పాటు చేసేలా చూసుకోండి. మీయొక్క వినియోగదారులు మిమ్మల్ని ఎలా సంప్రదించవచ్చో తెలుపుతూ మార్గదర్శకాలను పొందుపరచండి. అది మీ ఇరు పక్షాల మధ్య ఒక విశ్వసనీయమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది.
"టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి" అనే మా మరొక వ్యాసాన్ని కూడా పరిశీలించండి.
ఎక్జోలైట్‌లో, మేము మీకు ఒక పోటీతత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ వీడియోలు ఎక్కువ వీక్షణలని సంపాదిస్తున్నాయో, ఇతర కంటెంట్ సృష్టికర్తలతో ఎలా పోల్చాలో మరియు సిఫారసులని పొంది నిమగ్నతని ఎలా మెరుగుపరచాలో అర్థం చేసుకొనేందుకు సహకరించే శక్తివంతమైన విశ్లేషణలని మాయొక్క వినూత్నమైన వేదిక మీకు అందిస్తుంది.
వారి యొక్ టిక్‌టాక్‌ కంటెంట్‌పై పరిజ్ఞానాన్ని కలిగించడానికి మేము ఆ సోషల్ మీడియా ఏజెన్సీలతో, ప్రపంచ బ్రాండ్లతో మరియు ఒంటరిగానే పనిచేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లతో మేము పనిచేస్తాము. ఒక డెమోని బుక్ చేయడానికి మమ్మల్ని సంప్రదించండి, లేదా మీయొక్క ఉచిత ట్రయల్‌ని ఈరోజే ప్రారంభించండి!
[object Object] from Exolyt
Parmis from Exolyt
ఈ వ్యాసం Parmis చేత రాయబడింది. ఆవిడ గారు Exolytలో కంటెంట్ సృష్టికర్తగా పనిచేస్తున్నారు. సరికొత్త టిక్‌టాక్‌ ట్రెండ్లతో తనను తాను అప్‌డేట్‌లో ఉంచుకుంటూనే, రాయడంలో మరియు కొత్త విషయాల్ని కనుగొనడంలో ఆమె ఆసక్తిని కలిగివున్నారు.
7 May 2022

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

4 May 2022

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

14 Apr 2022

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

5 Apr 2022

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ

29 Mar 2022

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటో మరింత చదవండి

14 Mar 2022

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!

24 Jan 2022

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

10 Jan 2022

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

19 Dec 2021

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

30 Nov 2021

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు.

18 Nov 2021

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

25 Oct 2021

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది!

9 Jun 2021

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి.

13 Apr 2021

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి!

23 Feb 2021

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది!

14 Dec 2020

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

15 Oct 2020

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు?

6 Jun 2020

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి!

3 May 2020

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి!

25 Apr 2020

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

12 Apr 2020

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి!

1 Mar 2020

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి.

28 Feb 2020

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి!

24 Feb 2020

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

12 Feb 2020

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది!

9 Feb 2020

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము.

8 Feb 2020

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి!