
మార్గదర్శి (గైడ్)
TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?
ప్రచురించబడిందిFeb 08 2020
వ్రాసిన వారుJosh
TikTok షాడో బ్యాన్ అంటే ఏమిటి?
టిక్‌టాక్ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీయొక్క కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని మాత్రం నివారించదు. ఈ నిషేధం ఎంత కాలం వరకూ కొనసాగుతుందనే అధికారిక సమాచారం TikTok నుండి లేదు. స్పాం, అశ్లీల కంటెంట్, మరియు కాపిరైట్ సమస్యల నుండి రక్షించడానికి టిక్‌టాక్ యొక్క అల్గారిథం జరిపే ఒక ఆటోమేటిక్ ప్రక్రియ. మీ ఖాతా గనుక షాడో బ్యాన్ చేయబడితే, మీయొక్క వీడియోలు ఫర్ యూ పేజ్ ఫీడ్‌లో లేదా సెర్చ్ ఫలితాల్లో కనిపించవు.
మీయొక్క ఖాతా షాడో బ్యాన్‌కి గురైందని ఎలా తెలుసుకోవాలి?

మీయొక్క ఖాతా షాడో బ్యాన్ చేయబడిందని TikTok మీకు చెప్పదు. మీ వీడియోలు ఎటువంటి ఫర్ యూ పేజ్ వీక్షణలని పొందకపోతే, అప్పుడు మీ వీడియోలు బహుశా షాడోబ్యాన్‌కి గురైయ్యాయని అర్థం. మరీ ముఖ్యంగా మీరు ఇంతకు ముందు చాలా మంది అనుచరులని మరియు మంచి వీక్షణల సంఖ్యని కలిగివున్నట్లయితే.
TikTok ప్రో ఫీచరుని వాడటం ద్వారా మీయొక్క వీక్షణలు ఫర్ యు పేజీ నుండి వస్తున్నాయో లేదో చూడవచ్చు. TikTokలో ప్రతీ వీడియో కూడా కనీసం కొద్ది కాలం వరకైనా ఫర్ యూ పేజీలోకి వెళుతుంది. కాబట్టి వీడియో వీక్షణాలకి సంబంధించిన మూలల జాబితాలో ఫర్ యూ పేజ్ గనుక లేకపోతే, అప్పుడు మీ ఖాతా షాడోబ్యాన్ చేయబడిందని దానర్థం.
మీయొక్క ఖాతా షాడోబ్యాన్‌కి గురైనప్పటికీ కూడా మీయొక్క అనుచరులు మీ వీడియోలని వీక్షించగలరనే విషయాన్ని గుర్తుంచుకోండి.
TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి?
షాడో బ్యాన్స్ అనేవి వున్నాయని TikTok అధికారికంగా వెల్లడించలేదు, కాని ఆన్‌లైన్‌లో ఎన్నో కేసులు మరో విధంగా రుజువు చేస్తున్నాయి. మీ పైన నిషేదాన్ని తొలగించడానికి, ఆ నిషేదాన్ని కలిగించే అవకాశం వున్న వీడియోలను తొలగించి, తరువాత కొత్త కంటెంట్‌ని పోస్టు చేసే ముందు కొన్ని రోజుల వరకూ వేచిచూడాలి. నిషేధం పోవడానికి రెండు వారాల సమయం కూడా పట్టిందని కొంత మంది వెల్లడించారు. యాప్‌ని తొలగించే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇలా చేయడం మీయొక్క అన్ని డ్రాఫ్ట్‌లను కూడా తొలగిస్తుంది. మళ్ళీ మీరు వాటిని ఎప్పటికీ తిరిగి పొందలేరు!
ఇలా చేయడం మీ TikTok నుండి క్యాష్ మెమరీని తొలగించడంలో సహకరించకపోతే, లాగౌట్ అయి, యాప్‌ని తొలగించి మీయొక్క ఫోనుని రీబూట్ చేయండి. యాప్‌ని మళ్ళీ తిరిగి డౌన్లోడ్ చేసి, మళ్ళీ లాగిన్ అయ్యే ముందు ఒక 10 నిమిశాల వరకూ వేచివుండండి.
భవిష్యత్తులో షాడో బ్యాన్‌ని ఎలా నివారించాలి?
భవిష్యత్తులో మళ్ళీ షాడో బ్యాన్‌కి గురి కావాలని బహుశా మీరు కోరుకోరు. మాయొక్క గైడ్‌ని (మార్గదర్శిని) అనుసరించండి. అది మీ ప్రయాణంలో మీకు సహకరిస్తుంది.
కాపీరైట్ కంటెంట్‌ని పోస్టు చేయకండి! మీరు ఇతరుల యొక్క వీడియోలను లేదా మీకు ఆన్‌లైన్‌లో దొరికిన వీడియోలను అప్లోడ్ చేస్తే, అది కాపీరైట్ వివాదానికి దారి తీస్తుంది. దీనర్థం TikTok మీయొక్క వీడియోని తొలగించి మీయొక్క ఖాతాన్ని ఫ్లాగ్ చేయవచ్చు. కాబట్టి మీరు సృష్టించిన, మీ ద్వారా ఎడిట్ చేయబడిన కంటెంట్‌ని మాత్రమే మీరు పోస్ట్ చేయండి.
నగ్నత్వం వద్దు! తమ యాప్‌లో నగ్నత్వాన్ని ప్రదర్శించడం గురించి TikTok చాలా కఠిన వైఖరిని అవలంభిస్తోంది, ఎందుకంటే యాప్‌లో ఎంతో మంది చిన్న వయసు యూజర్లు వున్నారు కాబట్టి. TikTok చిన్న వయసున్న వాళ్ళని పాడు చేస్తోందనే విమర్శలను ఎదురుకుంటోంది. అందువలన వారు చిన్న వయసు పిల్లలను రక్షించడానికి వారి వంతు బాధ్యతని నిర్వహించాలనుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి అశ్లీల కంటెంట్‌ని లేదా నగ్నత్వం వున్న దృశ్యాలను పోస్ట్ చేయకండి.
చట్టబద్ధంగా వుండండి! చట్టబద్ధం కాని వీడియోలు మరియు కంటెంట్‌ని కలిగివున్న యూజర్లను TikTok నిషేదిస్తుంది. అందువలన మత్తుమందులు, తుపాకులు, కత్తులు, హింస లేదా ఇతర ఏవైనా చట్టబద్ధం కాని విషయాలకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయకండి.
మంచి వెలుతురు! TikTok అన్ని వీడియోలను వాటి యొక్క అల్గారిథంతో విశ్లేషిస్తుంది కాబట్టి, వీడియోలనేవీ తగినంత ప్రకాశవంతంగా వుండటం చాలా ముఖ్యం. ఎందుకంటే వారు వీడియోలలో ఏవైనా నిషేదిత పదార్థాలు గాని లేదా నగ్నత్వం గనుక ఉందేమోనని కనిపెట్టడానికి ఈ అల్గారిథంని ఉపయోగిస్తారు. వీడియో గనుక మరీ చీకటిగా వుంటే, ఈ అల్గారిథం పనిచేయదు, అలాంటి సందర్భంలో వీడియోను అది ఫ్లాగ్ చేస్తుంది.
చెల్లుబాటయ్యే పాటలను మాత్రమే వాడండి! వీడియో ఏర్పాటు చేసుకున్న ఆడియో గనుక పునఃసమీక్షలో వుంటే లేదా 'కాపీరైట్ పొందడానికి ప్రయత్నిస్తున్నాం', అని గనుక చూపెడుతూ వుంటే, ఆ వీడియో ఖచ్చితంగా నిషేధించబడుతుంది. ఎందుకంటే, TikTok కాపిరైట్ సమస్య వున్న ఏ ఆడియోని ఉపయోగించే సాహసం చేయదు.
ఒక పరికరానికి ఒకటే ఖాతా! ఒక పరికరానికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగివుంటే మీరు నిషేదానికి గురవుతారనే పుకార్లు వున్నాయి. దీని గురించి మేము కూడా ఖచ్చితమైన సమాచారాన్ని కలిగిలేము, కాని ఇప్పటికైతే కనీసం ఇది మీకొక హెచ్చరిక!
మొహాలు కనిపించని, మానవ గొంతులు లేని లేదా సహజమైన శరీర కదలికలు లేని వీడియోలను కూడా TikTok నిషేధిస్తుందనే ప్రస్తావనలు కూడా ఎన్నో వున్నాయి. ఇవేమీ కలిగిలేని వీడియోలు కూడా ఫర్ యూ పేజిలోకి చేరతాయి, కాని మీరు కొత్త కంటెంట్‌తో వచ్చే సమయంలో దీని గురించి కూడా మీరు ఆలోచిస్తే మంచిది. కాబట్టి మీయొక్క వీడియోని ప్రమోట్ చేయడానికి అల్గారిథంకి సంబంధించినంత వరకూ మానవ చర్యలే చేయండి.

Josh from Exolyt
ఈ వ్యాసం ఎక్సోలైట్‌లో సీనియర్ సోషల్ మీడియా కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న జోష్ రాశారు. జోష్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, మార్కెటర్లు మరియు కంటెంట్ సృష్టికర్తలు వారి నిశ్చితార్థాన్ని మెరుగుపరచుకోవడానికి మరియు వారి ఖాతాల నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి సహాయపడుతుంది.







