TikTok లో Y తరంగా ఎలా వుండాలి?
మార్గదర్శి

TikTok లో Y తరంగా ఎలా వుండాలి?

ప్రచురించబడిందిApr 02 2021
వ్రాసిన వారుJosh
మనం Y తరంగా ఉండటమనేది ఎప్పుడూ కూడా అంత సులభమేమీ కాలేదు. మనం చిన్న తరంగా వున్నపుడు, బూమర్లు (1946-1964) మరియు X తరం (1964-1980) వాళ్ళ చేతిలో ఎప్పుడూ అవమానాల పాలయ్యేవాళ్ళం. అంటే ఇంకేం పనీ పాటా లేకుండా కేవలం దీనికోసమో దానికోసమో ఒక ట్రోఫీని లేదా వివరణని ఇవ్వమని అడుగుతూ తిరిగేవాళ్ళమని మన ఉద్దేశం. "ఒక ఇల్లు ఎందుకని 75x ఖరీదు చేస్తోంది, అదే ధర నేను మీకు సంవత్సరమంతా చెల్లించడానికి సిద్ధంగా వున్నానుగా? ఇదిగో ఇలాగ మీ Y తరం వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారన్నమాట"
Y తరం నుండి X తరం వరకు
మనం ఇంతకూ ముందే తిట్టుకున్న X తరం వాళ్ళలాగే, కనీసం మన తరువాతి తరం వాళ్ళైనా మన బారాన్ని కొద్దివరకైనా దించుతారని ఆశించాము. కాని అలా జరగలేదు. ఆ వెక్కిరించే నూతన శతాబ్ది వారసులు (మీకు కావాలనిపిస్తే, వాళ్ళని Z తరం వాళ్ళు అని కూడా పిలవవచ్చు) మనల్ని వెక్కిరించే సంఘంలో ముందే చేరిపోయారు. మనకంటే కూడా ఎంతో ముందున్న మరియు మనకంటే ఎంతో డిజిటల్ పరిజ్ఞానం వున్న వాళ్ళందరూ కూడా, మన హెయిర్‌కట్‌ని, దుస్తుల్ని, మరియు కొద్ది నిమిషాల ముందే పుట్టిన సాంకేతికతని పూర్తిగా అవగాహన చేసుకోలేని మన అసమర్థతని ఆలస్యం చేయకుండా వెక్కిరించారు.
దురదృష్టకర ప్రభావకారి
ఇక ఇంతలో ప్రత్యక్షమైంది కోవిడ్-19. తరం కోణంలో చూస్తే, ఈ మహమ్మారి గొప్ప ప్రభావకారిగా వుంది. మనందరం ఒకే రకమైన పరిణామాలని అనుభవించడమే కాదు, మనం ఏమీ చేయలేకుండా ఇంట్లోనే వుండిపోవడం అనేది మన ఆసక్తులన్నింటినీ తీవ్రంగా మార్చేసింది. మనలో కొందరు, పెద్దవాళ్ళ పనులైన కుట్లూ, అల్లికలను చేయడం ప్రారంభిస్తే, నాలాంటి ఇంకొందరు చిన్న పిల్లలేం చేస్తున్నారో చూడాలని నిర్ణయించుకున్నారు.
ఏకాగ్రత వ్యవధి అవసరం లేని ప్రదేశానికి సుస్వాగతం
నా రాకను గమనించడానికి ఆ యూ.ఎస్.బి-పౌరాణిక రాక్షస Z తరం వాళ్ళు వారి స్క్రీన్ల నుండి తల పైకి ఎత్తే ఉంటారని నాకు అనుమానం ఉన్నప్పటికీ, వివిధ తరాలని ప్రభావితం చేసే వినోదంలోకి నా వ్యక్తిగత దండయాత్ర నా టిక్‌టాక్ ప్రవేశం రూపంలోనే జరిగింది.
మీకు తెలియకపోవచ్చు గానీ, ఈ మెరుపు వేగపు వీడియో షేరింగ్ వేదిక ఖచ్చితంగా క్షణాల ఏకాగ్రత పరిమితి మాత్రమే కలిగివుండే Z తరం వాళ్ళ కోసం రూపొందించబడిందే. అయినా కూడా, దీనిని ప్రేమించేంతగా దీనిలో ఏదో ఉందనే విషయం నేను త్వరగానే కనుగొన్నాను. అంతేకాదు, శక్తివంతమైన టిక్‌టాక్‌ ఆల్గారిథం నాకు సౌకర్యంతంగా వుండే రంగాన్ని ఏర్పరచుకోవడానికే కాదు, నా పొరుగు తరం వారి కోసం కూడా మంచిదనే విషయాన్ని నేను త్వరగానే తెలుసుకున్నాను.
మీకు తెలుసా, రంగు రంగుల జుట్టుతో వుండే పది పదమూడేళ్ళ పిల్లలు చేసే కేవలం పెదాలు కలిపే వీడియోల కన్నా కూడా ఇంకా ఎక్కువే టిక్‌టాక్‌లో వుంది. ఇందులో హాస్యపు స్కెచ్‌లు, మీరే స్వయంగా చేసుకునేలా, మీకు కళానైపుణ్యం నేర్పించే వీడియోలు మరియు మీరు సమాచారానికి సంబంధించినవిగా పిలవబడే వీడియోలు కూడా ఇందులో వుంటాయి. అంతేకాకుండా, సులభంగా వుండే "లైక్" లేదా "డోంట్ లైక్" వ్యవస్థకి ("హార్ట్స్" ద్వారా ప్రేమగా రూపొందించబడింది) మనం ధన్యవాదాలు చెప్పాలి, మీరు యాప్ నుండి ఏది కోరుకుంటున్నారో దానికి సరిగ్గా సరిపోయే ఫీడ్‌లో మీరు డయల్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు.
ఉదాహారణకి, మీకు "త్రో ఇట్ చాలెంజ్" అనే ఆట ఇష్టం ఉండకపోవచ్చు. ఈ ఆటలో టీనేజ్ పిల్లలందరూ ఒక వృత్తంలో నిలుచొని, గాల్లోకి వస్తువులని విసిరేస్తారు, అది ఎవరిని తాకితే వారిని బయటకి పంపివేస్తూ. అయితే, Y తరాన్ని కూడా దృష్టిలో వుంచుకొని రూపొందించిన ఎన్నో విచిత్రాలు వున్నాయి, ఉదాహరణకి గోబ్లిన్‌కోర్‌లాంటివి. గడ్డిని,బూజుని, పుర్రెలను, తొర్ర వున్న చెట్లని మరియు మురికి లాంటి వాటిని మెచ్చుకోవడమే ఈ అంశం. అంటే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమాలో మీరు ఎక్కువగా గుర్తించే పాత్ర గోల్లమ్ అయితే, మీరు సరిగ్గా #goblincore కోసమే అన్వేషిస్తున్నట్టు.
అంతేకాకుండా, Z తరం వారు "హిట్ ఆర్ మిస్!" అని జనం ఎక్కువగా వున్న ప్రదేశాలలో అరుస్తూ,"హిట్ ఆర్ మిస్ చాలెంజ్," అనే ఆటని అమితంగా ప్రేమిస్తున్నపుడు, మీరు ఆకర్షిస్తున్న ఆ దృష్టి మీ 29 ఏళ్ళ బాయ్‌ఫ్రెండ్‌కి నచ్చకపోవచ్చు. దానికి బదులు, కాక్‌టెయిల్‌ వంటకాలని, స్నాక్ ఐడియాలని, అంతేకాదు పూర్తి డిన్నర్ అంశాలని కూడా మీరు అన్వేషించవచ్చు. నిజానికి భోజన కంటెంట్ పరంగా టిక్‌టాక్‌ ప్రసిద్ధి చెందింది, మరియు వంటవారు ఈ వేదిక యొక్క టాప్ క్రియేటర్లుగా పరిణామం చెందారు.
వింతగా ఉండేలా, అయినా కూడా బాగా కనిపించేలా మీరు TikTok నుండి నేర్చుకోగలరా?
మీయొక్క కనుబొమ్మను షేవ్ చేసుకొని మళ్ళీ తిరిగి గీసుకోవడంగా కూడా పిలవబడే "ఫాక్స్ ఎయ్‌బ్రో చాలెంజ్"ని గనుక మీరు అనుసరిస్తే, మీ బాస్ మీకు ఆ పెద్ద ప్రమోషన్ ఇస్తాడో ఇవ్వడో ఖచ్చితంగా తెలియడం లేదా? దీనికి బదులు, ఎందుకని టిక్‌టాక్‌నే వాళ్ళ ఇల్లుగా మార్చుకున్న బ్యూటి మరియు ఫ్యాషన్ రంగంలోని వందల మంది ప్రభావశీలుల యొక్క వీడియోలని చూడకూడదు? కొత్త హెయిర్‌స్టైల్స్‌నుండి మేకప్ ట్రెండ్స్ మరియు దుస్తుల ఐడియాల వరకూ, మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకోవడానికి ఇందులో ఎన్నో రకాల మార్గాలు వున్నాయి. (మీ మొహాన్ని ఒక ఆఫీస్ జోక్‌గా మార్చడానికి మాత్రం కాదు).
ఎప్పుడూ పరిణామం చెందుతూ వుండే మీయొక్క "వింత" బ్రాండుకి సరిగ్గా సరిపోయేదాని కోసం మీరు అన్వేషిస్తున్నా, లేదా వీలైనంత గొప్పగా కనిపించాలనే మీయొక్క కోరికను అన్వేషిస్తున్నా, మన Y తరం వారి అభిరుచులకి చక్కగా సరిపోయే ఎన్నో అంశాలు టిక్‌టాక్‌లో వున్నాయి. వ్యక్తిగతంగా నాకు కళలు మరియు కళానైపుణ్యాల హ్యాష్ ట్యాగులంటే చాలా ఇష్టం.ఇవి నా యొక్క ఆఫీసుని మరియు లివింగ్ రూమ్ ప్రదేశాలని పూర్తిగా నాకు నచ్చే, నా స్వంత వాటిగా మార్చాయి. అయినా కూడా, దానర్థం, నేను అప్పుడో ఇప్పుడో ట్రెండింగ్‌లో వుండే హ్యాష్ ట్యాగుల్లోకి దూకనని కాదు. ఏదేమైనా, మన Y తరం వాళ్ళం ఎప్పుడూ కూడా ఒక చాలెంజ్ నుండి వెనుకడుగు వేసే వాళ్ళం మాత్రం కాదు (మనం ఎంత మూర్ఖులమైనా సరే).
కాబట్టి మీరు గనుక 25 ఏళ్ళ పైబడిన వాళ్ళయితే, కాని ఈ కష్ట సమయంలో "టిక్‌టాక్‌పై ఆసక్తిని" పెంచుకుంటూ వుంటే గనుకా, భయం లేకుండా వుండండి! ప్రతీ ఒక్కరూ ఆస్వాదించడానికి కావలసినంత కంటెంట్ వుంది. ఎవరికి తెలుసు? మీ న్యాయవాది పెద్దన్న కంటే, మీ చిన్నారి మేన కోడలి అభిరుచులనే మీరు కూడా కలిగివున్నారని మీరు తెలుసుకుంటారేమో? అది ఒక ఆసక్తికరమైన కుటుంబ సంభాషణకి దారి తియ్యదంటారా?
[object Object] from Exolyt
Josh from Exolyt
ఈ వ్యాసం Josh చేత రాయబడింది. ఆయన Exolyt లో Senior Social Media Consultant గా పనిచేస్తున్నారు. ప్రభావశీలులు, విక్రయదారులు వారియొక్క నిమగ్నతని మెరుగుపరుచుకొని వారి ఖాతాల నుండి ఎంతో పొందే విధంగా Josh గారు వారికి సహాయం చేస్తారు.
7 May 2022

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

మీరు టిక్‌టాక్‌లో చాలా వేగంగా ఫాలో అవుతున్నారని ఎలా పరిష్కరించాలి?

4 May 2022

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

సోషల్ లిజనింగ్ కోసం TikTok ఎలా ఉపయోగించాలి

14 Apr 2022

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడానికి ఉత్తమ సమయం

5 Apr 2022

టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్ జనరేటర్

మీ టిక్‌టాక్ అనలిటిక్స్‌ను పెంచడానికి తదుపరి దశ

29 Mar 2022

TikTok కథనాలు ఏమిటి?

TikTok కథనాలు ఏమిటో మరింత చదవండి

14 Mar 2022

మీయొక్క TikTok నిమగ్నత రేటుని కనుగొనండి!

TikTokలో మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని మాయొక్క సాధనంతో కనుగొనండి! మీ వీడియో యొక్క నిమగ్నతా రేటుని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని ఉపయోగించండి!

24 Jan 2022

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

ఒక చిన్న బ్రాండ్ స్థానంలో టిక్‌టాక్‌ నుండి ఎలా ప్రయోజనం పొందాలి?

10 Jan 2022

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌తో ఎలా మొదలుపెట్టాలి?

19 Dec 2021

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

మీడియా ఏజెన్సీలు ఎందుకని టిక్‌టాక్‌ విశ్లేషణల కొరకు ఎక్జోలైట్‌ని ఉపయోగించాలి?

30 Nov 2021

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించబోయే ఒక గొప్ప సంచలనమని చెప్పడానికి గల 11 కారణాలు.

ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది తరువాత సంభవించే పెద్ద విషయమని చెప్పడానికి గల 11 కారణాలు.

18 Nov 2021

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

తప్పుడు ఎడిటింగ్ సాధనాలను ఉపయోగించడం మీయొక్క టిక్‌టాక్‌ వీక్షణలని దెబ్బతీయవచ్చు.

5 Nov 2021

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి

టిక్‌టాక్‌లో పోటీదారులను ఎలా పోల్చాలి - యుద్దాన్ని గెలవడానికి ఒక మార్గదర్శి!

25 Oct 2021

టిక్‌టాక్‌ని ఒక బ్రాండ్‌గా ఎలా ఉపయోగించాలి?

టిక్‌టాక్‌తో ఎలా మొదలవ్వాలనే దాని గురించిన అంతిమ వ్యాపార గైడ్ ఇది!

9 Jun 2021

ఐఫోన్‌లో TikTok ఫోటో ఎడిటింగ్ హ్యాక్‌ని ఎలా చేయాలి

టిక్‌ టాక్‌లో ప్రతీ ఒక్కరూ మాట్లాడుకుంటున్న ఈ ఫోటో ఎడిటింగ్ యాప్ ఏంటో తెలుసుకోండి.

13 Apr 2021

ప్రతీ వీక్షణకి TikTok సంపాదన తెలిపే కాలిక్యులేటర్

TikTok పైన వీడియో వీక్షణలతో మీరు ఎంత సంపాదించగలరో మాయొక్క సాధనం సహాయంతో తెలుసుకోండి! TikTok ప్రభావశీలుల యొక్క సంపాదనని లెక్కించడానికి మాయొక్క కాలిక్యులేటర్‌ని వాడండి!

23 Feb 2021

YouTube నగదు కాలిక్యులేటర్

మాయొక్క YouTube నగదు కాలిక్యులేటర్‌తో YouTube స్ట్రీమర్లు మరియు ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ప్రతీ YouTube ఖాతాకి ఇది పనిచేస్తుంది!

14 Dec 2020

మీయొక్క TikTok ఖాతాని ప్రైవేట్ ఖాతాగా లేదా పబ్లిక్ ఖాతాగా ఎలా మార్చాలి?

ఎందరో తమ TikTok ఖాతాని ప్రైవేటు ఖాతాగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారు. ప్రైవేటు ఖాతా అదనపు గోప్యతని అందిస్తుంది మరియు మీయొక్క వీడియోల పంపిణీని గొప్పగా నియంత్రించేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.

15 Oct 2020

Alt TikTok అంటే ఏమిటి?

మాములుగా Straight TikTok లో కనిపించని కంటెంట్‌ని ప్రజలు ఇందులో మాత్రం చూడటం మరియు షేర్ చేయడం లాంటి పద్దతి ప్రకారం చూస్తే Alt TikTok అనేది భిన్నమైనది. మీరు ఏ వైపు వున్నారు?

6 Jun 2020

TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలి?

TikTok వీడియోలకి మీయొక్క బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడమనేది ప్రస్తుతం నడుస్తున్న అతి పెద్ద ట్రెండ్లలో ఒకటి. TikTokలో బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా మార్చాలో తెలుసుకోండి!

3 May 2020

TikTokలో ఎలా ధృవీకరించబడాలి?

ధృవీకరించబడిన లేదా ప్రజాదరణ పొందిన క్రియేటర్ అంటే అర్థం మీయొక్క ప్రొఫైల్ మీద ఒక చిన్న నీలి రంగు చెక్‌మార్క్‌ఉండటం. TikTokలో ఎలా ధృవీకరించబడాలో తెలుసుకోండి!

25 Apr 2020

TikTokలో వాయిస్‌ఓవర్‌ ఎలా చేయాలి?

TikTokలో ఇప్పుడు సరిక్రొత్త వాయిస్‌ఓవర్‌ ఫీచర్ అందుబాటులో వుంది! మీ వీడియోలకి దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

12 Apr 2020

TikTok నగదు కాలిక్యులేటర్

మాయొక్క TikTok నగదు కాలిక్యులేటర్‌తో TikTok ప్రభావశీలులు ఎంత సంపాదిస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. TikTokలో మరింత డబ్బుని ఎలా సంపాదించాలో తెలిపే మాయొక్క చిట్కాలని కూడా చూడండి!

1 Mar 2020

TikTokలో డబ్బులు ఎలా సంపాదించాలి?

TikTokలో ఎలా డబ్బులు సంపాదించాలో తెలిపే ఉత్తమమైన చిట్కాల కొరకు మేము అందిస్తున్న గైడ్‌ని (మార్గదర్శిని) పరిశీలించి TikTok ప్రభావశీలునిగా మారండి.

28 Feb 2020

TikTokలో FYP అంటే అర్థం ఏమిటి?

మీరు TikTokలో గమనించే #fyp అనేదానికి అర్థం ఏమిటి? ఇది ఫర్ యూ పేజీలోకి మీరు వెళ్ళే విధంగా మీకు సహాయం చేస్తుందా? ఈ హ్యాష్ ట్యాగ్‌కి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనండి!

24 Feb 2020

#XYZBCA అంటే ఏమిటి?

#xyzbca అనేది ఒక TikTok హ్యాష్‌ట్యాగ్. ప్రజలు తమ వీడియోను ఫర్ యూ పేజీలో చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు.

12 Feb 2020

TikTok విశ్లేషణలను ఎలా చూడాలి?

ప్రతీ పబ్లిక్ TikTok ప్రొఫైల్ యొక్క విశ్లేషణలు మరియు వాటి యొక్క వీడియోలను చూడటానికి మీరు Exolytని ఉపయోగించవచ్చు. అన్ని పబ్లిక్ ప్రొఫైళ్ళకి మరియు వాటి యొక్క వీడియోలకి ఇది పనిచేస్తుంది!

9 Feb 2020

TikTokలో ఎలా ఫేమస్ అవ్వాలి?

TikTokలో ఒక ట్రెండింగ్‌ వీడియోని మీరు సృష్టించాలని అనుకున్నపుడు మీరు దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. ఆ విషయాలని మేము మీతో సంతోషంగా పంచుకుంటాము.

8 Feb 2020

TikTok షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలి? షాడో బ్యాన్ అంటే ఏమిటి?

టిక్‌టాక్‌ షాడో బ్యాన్ అనేది మీయొక్క ఖాతాపై విధింపబడే ఒక తాత్కాలికమైన నిషేధం, కాని ఇది మీరు కంటెంట్‌ని అప్లోడ్ చేయడాన్ని నివారించదు. మీరు గనుక షాడో బ్యాన్‌కి గురైతే, మీయొక్క కంటెంట్ ఫర్ యూ పేజీలోకి వెళ్ళదు. షాడో బ్యాన్‌ని ఎలా తొలగించాలో తెలిపే మాయొక్క చిట్కాలని చూడండి!