How to make money on TikTok?
Guide

How to make money on TikTok?

PublishedMar 01 2020
Written byJosh

TikTokలో డబ్బులు మీరు ఎలా సంపాదించగలరు?

మీయొక్క TikTok ప్రొఫైలులో డబ్బులు సంపాదించడానికి ప్రధానంగా రెండు మార్గాలున్నాయి.
అతి సామాన్యమైన మార్గాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్ అంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్ అంటే మీరు వివిధ రకాల బ్రాండ్లను మరియు ఉత్పత్తులను మీయొక్క వీడియోలలో ప్రమోట్ చేస్తారు. దీనర్థం ఆయొక్క బ్రాండుకి లేదా ఉత్పత్తికి మరింత అమ్మకాలను పెంచే ప్రకటన వీడియోలను మీరు సమర్పించడం.
TikTokలో డబ్బులు సంపాదించే రెండవ మార్గం ఏంటంటే నేరుగా మీయొక్క స్వంత ఉత్పత్తులను లేదా సర్వీసులను మీయొక్క వీడియోల ద్వారా అమ్మడం.
మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్ లేదా మీయొక్క స్వంత సర్వీసులను ప్రమోట్ చేస్తున్నప్పటికీ, మీకు మీ వీడియోలకి ఖచ్చితంగా మంచి ట్రాక్షన్ మరియు వీక్షణల సంఖ్య అవసరం వుంటుంది. దీనర్థం ఆ బ్రాండు కొరకు చేసే ప్రకటన స్థాయికి ప్రేక్షకులని మీయొక్క ప్రొఫైల్ ఆకర్షించే ముందు మీరు ఎక్కువ మంది అనుచరులని, కామెంట్లని, లైకులని మరియు వీక్షణలని కలిగివుండాలి. సాధారణంగా ప్రతీ వీడియోకి మీరు 100000 కంటే ఎక్కువ మంది అనుచరులను మరియు వందలకొద్దీ కామెంట్లని కలిగివుండాలి.

నేను TikTokలో ఎంత డబ్బు సంపాదించగలను?

ప్రతీ ప్రొఫైల్‌కి డబ్బు మొత్తంలో చాలా వత్యాసం వుంటుంది. మీరు ప్రతీ ఒక బ్రాండ్ భాగస్వామ్యానికి 50 000 USD నుండి 150 000 USD వరకూ సంపాదించవచ్చు. ఇది నిస్సందేహంగా మీరు ఎంచుకున్న రంగం ప్రదేశం, బ్రాండు లక్ష్యంగా వున్న ప్రేక్షకులు, మీయొక్క ప్రొఫైల్ నిమగ్నత మరియు ఇంకెన్నో విషయాలపై ఆధారపడి వుంటుంది.

TikTok ప్రభావశీలిగా మారడానికి ఎంత సమయం తీసుకుంటుంది?

సాధారణంగా దృఢమైన ట్రాక్షన్ మరియు అనుచరుల సంఖ్య సంపాదించడానికి నాలుగు నుండి ఎనిమిది నెలల వరకూ సమయం పడుతుంది. ఇది ఎక్కువగా మీయొక్క కంటెంట్ మీదే ఆధారపడి వుంటుంది, ఎందుకంటే కొన్ని ప్రొఫైళ్ళు వాటి యొక్క మొదటి నెలలోనే 100 000 అనుచరులని కలిగివుంటాయి. ఆ ప్రొఫైళ్ళు చాలా మంచి నిమగ్నత రేటుతో అధిక నాణ్యతతో కూడిన కంటెంట్‌ని సృష్టించాయన్నమాట.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారత దేశం, రష్యా లేదా టర్కీ లాంటి అత్యధిక TikTok యూజర్లు వున్న దేశాల్లో గనుక మీరు నివసిస్తూ వుంటే, మీయొక్క ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా వుండే అవకాశం వుంది కాబట్టి మీరు చాలా త్వరగా ఒక ప్రభావశీలిగా (Influencer) ఎదుగుతారు. అంతే స్థాయిలో పోటీ కూడా ఉంటుందని దీనర్థం.

నేను TikTok ప్రభావశీలిగా ఎలా కాగలను?

TikTok ప్రభావశీలి కావడానికి ఎటువంటి మ్యాజిక్ ట్రిక్కులు అవసరం లేదు. కాని బాధపడకండి! పోటీలో మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళే ఎన్నో విషయాలు ఇక్కడ అందుబాటులో వున్నాయి.
TikTok ప్రభావశీలిగా మారడానికి ఇదే మేము అందించే సూచనల జాబితా:
మీయొక్క ప్రేక్షకులతో నిమగ్నమవ్వండి. జవాబులు ఇవ్వండి, కామెంట్లను లైక్ చేయండి, వీడియో ఐడియాల కొరకు మీ ప్రేక్షకులు చెప్పేది వినండి.
ప్రతీదీ తాజాగా వుంచండి. తాజా ట్రెండ్లను అనుసరించండి, కాని ఎల్లప్పుడూ కూడా మీయొక్క స్వంత ట్విస్ట్‌ను జోడించడానికి ప్రయత్నించండి. ఇది మీయొక్క ప్రొఫైల్‌ని ఆసక్తికరంగా మారుస్తుంది.
ప్రత్యేకంగా మరియు ప్రామాణికంగా ఉండండి! ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైన వ్యక్తులను మరియు ప్రత్యేకమైన కంటెంట్‌నే చూడటానికి ఇష్టపడతారు. కాబట్టి భిన్నంగానే ఉండటానికి సాహసం చేయండి!
మా సూచనల జాబితాకి అదనంగా, TikTok ప్రభావశీలిగా ఎదిగే మీయొక్క ప్రయాణంలో మీయొక్క పురోగతిని ట్రాక్ చేయడానికి మీరు వివిధ రకాల సాధనాలను కూడా ఉపయోగించవచ్చు. మీయొక్క ప్రొఫైల్‌ను పరిశీలించి ఏ కంటెంట్ మీ ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటుందో తెలుసుకోవడానికి మాయొక్క ఉచిత TikTok విశ్లేషణ సాధనాన్ని ప్రయత్నించండి.

అనుబంధ కార్యక్రమంతో డబ్బు సంపాదించండి

మాయొక్క అనుబంధ కార్యక్రమంతో మీయొక్క TikTok అనుచరులని సులభంగా మానిటైజ్ చేయండి! మీయొక్క అనుచరులకి Exolyt గురించి తెలియజేయండి మరియు క్రొత్త సబ్‌స్క్రిప్షన్లపై కమీషన్లను సంపాదించండి. మీయొక్క డిస్కౌంట్ కోడ్‌ని ఉపయోగించి యూజర్లు జరిపే ప్రతీ అమ్మకపు లావాదేవీ నుండి మీరు కమీషన్‌ని సంపాదిస్తారు. మీయొక్క అనుచరులకి వారి చెల్లింపు సబ్‌స్క్రిప్షన్‌యొక్క మొదటి నెలపై డిస్కౌంటుని వారికి బహుమతిగా ఇవ్వండి. మాయొక్క అనుబంధ కార్యక్రమలో చేరడం పూర్తిగా ఉచితం.
అనుబంధ కార్యక్రమం గురించి మరింత చదవండి
Josh from Exolyt
Josh from Exolyt
This article is written by Josh, who works at Exolyt as a Senior Social Media Consultant. Josh helps influencers, marketers and content creators to improve their engagement and take the most out of their accounts.
ఈ వ్యాసాన్ని పంచుకోండి

ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం వ్యాసాలు