
మార్గదర్శి (గైడ్)
TikTokలో ఎలా ధృవీకరించబడాలి?
ప్రచురించబడిందిMay 03 2020
వ్రాసిన వారుAngelica
TikTokలో దృవీకరణ పొందటం అంటే ఏమిటి?

ధృవీకరించబడటం అంటే మీయొక్క ప్రొఫైల్ మీద చెక్‌మార్కుతో కూడిన ఒక నీలి రంగు బ్యాడ్జీ వుంటుంది. ఇంతకు ముందు ధృవీకరణ పొందిన TikTok ప్రొఫైళ్ళు చిన్న కిరీటపు ఐకాన్‌ని కలిగివుండేవి. కాని ఇప్పుడు దానిని ఒక ధృవీకరణ చెక్‌మార్కుతో మరియు ధృవీకరించబడిన ఖాతా (వెరిఫైడ్) అనే వాక్యంతో మార్చడం జరిగింది.
ధృవీకరించబడిన ప్రొఫైల్ ప్రామాణికతను ప్రదర్శించి నమ్మకాని పెంచుతుంది. ధృవీకరించబడిన ప్రొఫైళ్ళు ఎక్కువ మంది అనుచరులను మరియు వారి యొక్క నిమ్మగ్నతను కూడా ఆకర్షిస్తాయి.
నిజానికి ధృవీకరించబడిన ప్రొఫైళ్ళలో ఎక్కువ మంది పాప్ తారలు, సంగీతకారులు మరియు ప్రముఖులు, కాని మీరు కూడా ధృవీకరణ పొందడానికి ఇదేమీ అడ్డంకి కాదు.
పాపులర్ క్రియేటర్ బ్యాడ్జి అంటే ఏమిటి?
TikTokలో ధృవీకరణ పొందటానికి పాపులర్ క్రియేటర్ బ్యాడ్జి అనేది మరొక మార్గం. TikTokలో మంచి సంఖ్యలో అనుచరులను కలిగివున్న మరియు ఎక్కువ సంఖ్యలో వీక్షణలని, లైకులని మరియు షేర్లను పొందే పోస్టుల కంటెంట్‌ని కలిగివున్న ప్రొఫైళ్ళకి TikTok పాపులర్ క్రియేటర్ బ్యాడ్జీని అందిస్తుంది.
TikTok బృందం నిరంతరంగా ప్రజాదరణ పొందుతున్న ఖాతాలను పరిశీలిస్తూ అధిక నాణ్యత కలిగిన ప్రొఫైళ్ళకి ఆటోమెటిక్‌గా పాపులర్ క్రియేటర్ బ్యాడ్జీలను జోడిస్తుంది. కాబట్టి మీరు దీని కొరకు అర్హత పొందినపుడు ఆటోమెటిక్‌గా మీరు దీనిని పొందుతారు.
TikTokలో ఎలా ధృవీకరించబడాలి?
మంచి కంటెంట్‌ను సృష్టించండి
TikTok అధిక నాణ్యత కలిగిన కంటెంట్‌ని సృష్టించే ప్రొఫైళ్ళకు ధృవీకరణ బ్యాడ్జీలను మరియు అవార్డులను అందిస్తుంది. కాబట్టి మంచి వెలుతురు వున్న వాతావరణంలో మీయొక్క చిత్రీకరణలు జరిగేలా మరియు అత్యధిక నాణ్యత కలిగిన వీడియోలను మీరు రూపొందించేలా నిర్థారించుకోండి. ఒకరి పడకగదిలో చిత్రీకరించిన వణికే వీడియోలను చూడాలని ఎవరూ కోరుకోరు.
అనుచరులని సంపాదించండి
ధృవీకరణ పొందిన ప్రొఫైళ్ళలో ఎక్కువ ప్రొఫైళ్ళు అత్యధిక సంఖ్యలో అనుచరులని కలిగివుంటాయి. ఇది ఒక ధృవీకరించబడిన ప్రొఫైల్ కొరకు ఖచ్చితమైన అవసరం కానప్పటికీ, మీరు ధృవీకరణ పొందేలా ఇది మీకు సహకరిస్తుంది.
తాజా పాటలను తెలుసుకోండి
మీరు కొద్ది కాలం నుండి TikTokని గనుక ఉపయోగిస్తూ వుంటే, ఒకే పాటలు మరియు హ్యాష్‌ట్యాగ్‌లు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవ్వడాన్ని మీరు గమనించే వుంటారు. వాటిని ఉపయోగించడానికి భయపడకండి! ప్రజాదరణ పొందిన పాటలకి TikTok అనుకూలిస్తుంది, మరియు జనం వాటిని ఉపయోగించాలని కోరుకుంటుంది! ప్రజాదరణ పొందిన పాటలను మరియు హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడమనేది మీరు మీయొక్క కంటెంట్‌ని ఫర్ యూ పేజీలోకి వెళ్ళేలా మరియు మీరు మరింత మంది అనుచరులను సంపాదించేలా మీకు సహకరిస్తుంది.
ఇతర సామజిక మాధ్యమాలలో ధృవీకరించబడండి
TikTokలో ధృవీకరణ పొందడానికి బహుశా ఇదే ఉత్తమమైన మార్గం. ధృవీకరించబడటానికి కేవలం 100 మంది అనుచరులను కలిగివున్న ప్రొఫైళ్ళని కూడా మేం చూశాము. అంతే అవసరం, ఎందుకంటే వాళ్ళు మూడు వేరు వేరు సామాజిక మాధ్యమాలలో ధృవీకరించబడ్డారు.
కాబట్టి ఇతర సామాజిక మాధ్యమాలలో ధృవీకరణ పొంది వాటిని TikTokకి జత చేయండి.
నన్ను ధృవీకరిస్తామని చెప్పే ఒక సైట్ నాకు దొరికింది!
మీరు ధృవీకరణ పొందేలా చేస్తామని పేర్కొనే సైట్లన్నీ కూడా మీకు అబద్దం చెబుతున్నాయి. మీరు ధృవీకరణ పొందేలా చేసే అడ్డదారులు గాని, హ్యాకులు గాని ఏవీ లేవు. కాబట్టి, అవి స్కాములు కాబట్టి ఎట్టి పరిస్థితులలోను ఇటువంటి సైట్లను ఉపయోగిస్తూ మీయొక్క డబ్బుని మరియు సమయాన్ని వృథా చేసుకోకండి.
తుది ఆలోచనలు
వెరిఫికేషన్ (ధృవీకరణ) బ్యాడ్జితో TikTok దాని యొక్క ఉత్తమ కంటెంట్ క్రియేటర్లను ప్రత్యేకంగా చూపిస్తుంది. ధృవీకరించబడిన వాటిలో ఎక్కువ ప్రొఫైళ్ళు చురుగ్గా వుండి, ప్రతీరోజు అధిక నాణ్యత కలిగిన కంటెంట్‌ని పోస్టు చేస్తాయి. అసలైన ధృవీకరణ ప్రక్రియ అనేది TikTokలో ఒక గొప్ప రహస్యం అయినప్పటికీ, మీరు TikTok ధృవీకరణ పొందడానికి మాయొక్క చిట్కాలు మీకు ఉత్తమమైన మార్గమని మేము విశ్వసిస్తున్నాము.
మీరు ప్రేక్షకులని పెంచుకోవడం మరియు ఎక్కువ అనుచరులని సంపాదించుకోవడం కష్టమైనప్పటికీ, అంత కష్టపడవలసిన అవసరం లేదు. మీయొక్క ప్రేక్షకులకి ఏది ఉత్తమంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మీరు సృష్టించే కంటెంట్‌ని మీరు విశ్లేషించేలా Exolytలోని మేము మీకు సహకరిస్తాము. మీరు ఎలాంటి పనితీరుని కనబరచాలో మరియు ఎలా మెరుగుపరచాలో తెలుసుకోవడానికి మీయొక్క ప్రొఫైలుని Exolytలో వెతకండి!

Angelica from Exolyt
ఈ వ్యాసం ఎక్సోలైట్‌లో సీనియర్ సోషల్ మీడియా మేనేజర్‌గా పనిచేస్తున్న ఏంజెలికా రాసినది. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, మార్కెటర్లు మరియు కంటెంట్ సృష్టికర్తలు వారి నిశ్చితార్థాన్ని మెరుగుపరచుకోవడానికి మరియు వారి ఖాతాల నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి ఏంజెలికా సహాయపడుతుంది.







