టిక్‌టాక్ అనలిటిక్స్ కోసం మీడియా ఏజెన్సీలు Exolyt‌ను ఎందుకు ఉపయోగించాలి
గైడ్

టిక్‌టాక్ అనలిటిక్స్ కోసం మీడియా ఏజెన్సీలు Exolyt‌ను ఎందుకు ఉపయోగించాలి

ప్రచురించబడిందిDec 19 2021
రచించారుParmis
ఈనాడు ఎన్నో కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌ అత్యంత ప్రజాదారణ పొందిన వేదికలలో ఒకటిగా ఎదిగింది; వినోదం, కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, అమ్మకాల్ని పెంచడం, ప్రచారాలని నిర్వహించడం, మరియు ఇంకెన్నో. ఏదైనా ఒక కారణం కొరకు అభివృద్ధి చేసుకోవాలనుకునే ఉద్దేశ్యంతో ఒక టిక్‌టాక్‌ ఖాతాని గనుక మీరు కలిగివున్నట్లయితే, మీరు దేన్నైతే నిర్మిస్తున్నారో దానిని మెరుగుపరచడానికి మీరు మీయొక్క ఖాతాని మరియు దానియొక్క పనితీరుని పర్యవేక్షించాలి. ఇది బాగానే అనిపిస్తుంది కదా? ఎక్జోలైట్ యొక్క అత్యుత్తమ ఫీచర్లని ఉపయోగిస్తూ మీరు ఏ సాధించగలరనే దాని యొక్క పూర్తి పర్యటన కొరకు నిరీక్షించండి.
ఎక్జోలైట్ మీ ఖాతా యొక్క పూర్తి సమీక్షని అందిస్తుంది.
ఒక సాధారణ దృష్టికోణంలో మీయొక్క ఖాతా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం ప్రధానమైనది. ఈ క్రింది అన్ని అంశాల యొక్క పూర్తి సమీక్షని ఎక్జోలైట్ మీకు అందిస్తుంది:
అనుచరుల సంఖ్య
వీడియోల సంఖ్య
మొత్తం వీక్షణలు
మొత్తం లైకులు
మొత్తం వాఖ్యలు (కామెంట్లు)
మొత్తం వీడియో షేర్లు
ధృవీకరించబడింది / ధృవీకరించబడనిది
ప్రభావ నిష్పత్తి (అనుచరుల ఆధారిత ప్రభావం)
Follower count
Title
< 10000
Nano Influencer
< 100000
Micro Influencer
< 1000000
Macro Influencer
> 1000000
Mega Influencer
సగటు వీక్షణలు
సగటు లైకులు
సగటు వాఖ్యలు
సగటు వీడియో షేర్లు
ఎక్సో స్కోరు 10కి (ప్రొఫైల్ యొక్క మా విశ్లేషణ ఆధారంగా స్కోరు)
నిమగ్నత (ప్రొఫైల్‌లోని అన్ని వీడియోల ఆధారంగా స్కోరు)
అనుచరుల లైకుల నిష్పత్తి (లైకులు అనేవి అనుచరులను కూడా తీసుకొస్తాయని పెద్ద నిష్పత్తి చూపుతుంది)
ప్రాంతం (యూజర్ల యొక్క అత్యధిక వీడియోలు పోస్టు చేయబడే ప్రాంతం ఇదే)
టిక్‌టాక్‌-విశ్లేషణల-కొరకు-ఎక్జోలైట్
మీకు తాజా డేటాని అందించేలా చూసుకుంటాము.
మీయొక్క ఎక్జోలైట్ ఖాతా సహాయంతో మీరు మీయొక్క మరియు ఇతర యూజర్ల యొక్క ఖాతాలని సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఇక మేము డేటాని నిరంతరం అప్‌డేట్‌ చేస్తూనే వుంటాం. ఆ విధంగా మీరు తాజా గణాంకాలని కలిగివుంటారు.
మీరు సవివరమైన వీడియో గణాంకాలను తనిఖీ చేయగలరు.
సేకరించిన డేటాని చక్కగా అర్థం చేసుకోవడానికి గ్రాఫ్‌లు మరియు టేబుల్స్‌తో పాటు ఎక్జోలైట్ సవివరమైన వీడియో గణాంకాలను కూడా మీకు అందిస్తుంది. ఈ క్రింది చిత్రంలో చూసినట్లుగా, వీడియో గణాంకాల విభాగం "వీడియో లైకుల పంపిణీ" మరియు "వీడియోల మొత్తానికి" సంబంధించిన చార్టులని ప్రదర్శిస్తుంది; ఇది మీ వీడియోల పనితీరుకి సంబంధించిన దృశ్య వివరణని మీకు అందిస్తుంది.
టిక్‌టాక్‌-విశ్లేషణల-కొరకు-ఎక్జోలైట్
మీయొక్క ఖాతా పైన ఉత్తమ పనితీరుని కనబరుస్తున్న వీడియోలను మాయొక్క విశ్లేషణ వేదిక ప్రదర్శిస్తుంది. మీరు ఈ క్రింద చూసినట్లుగా, ఎక్కువగా లైక్ చేయబడిన, కామెంట్ చేయబడిన, మరియు షేర్ చేయబడిన వీడియోలు ఖాతా యొక్క ప్రచారంలో ప్రముఖమైన పాత్రని పోషిస్తాయి కాబట్టి, వాటికి సంబంధించిన డేటాని మీరు చూడవచ్చు.
టిక్‌టాక్‌-విశ్లేషణల-కొరకు-ఎక్జోలైట్
సవివరమైన గణాంకాలతో ఎవరు మీయొక్క ఖాతాని ప్రస్తావించారో మీరు చూడవచ్చు.
మీయొక్క ఖాతా ఎక్కడ ప్రస్తావించబడుతోందో ట్రాక్ చేయాలనుకుంటున్నారా? ఎక్జోలైట్ దగ్గర మీ కొరకు ఒక ఉత్తమమైన ఫీచర్ వుంది! గత 30 రోజులంత తాజా సమాచారాన్ని మరియు గత 365 రోజులంత పెద్ద సమాచారాన్ని మీరు కలిగివుండవచ్చు. వీడియోల సంఖ్య, వీక్షణలు, లైకులు, మరియు ప్రస్తావనా సమయంతో పాటుగా తాజాగా ప్రస్తావించబడిన మరియు ఎక్కువగా ప్రస్తావించబడిన డేటాని మీరు సర్దుబాటు చేయవచ్చు.
టిక్‌టాక్‌-విశ్లేషణల-కొరకు-ఎక్జోలైట్
మీయొక్క కంటెంట్ ఎంత బాగా పనిచేస్తుందో పరిశీలించండి.
మీయొక్క టాప్ కంటెంట్ యొక్క జాబితాని ఎక్జోలైట్ యొక్క విశ్లేషణల వేదిక ప్రదర్శిస్తుంది, అంటే ఫీచర్ అయిన హ్యాష్‌ట్యాగ్‌లతో పాటుగా ఎక్కువగా లైక్ చేయబడిన మరియు ఎక్కువగా కామెంట్ చేయబడిన కంటెంట్ అన్నమాట. ఈ క్రింది చిత్రంలో, వోన్ జియాంగ్ యొక్క కంటెంట్‌కి సంబంధించి ఎక్జోలైట్ అందించిన విశ్లేషణని మీరు చూడవచ్చు. అదే విశ్లేషణ ఎక్కువగా కామెంట్ చేయబడిన కంటెంట్‌కు కూడా వర్తిస్తుంది.
మీయొక్క ప్రేక్షకులు ఏ రకమైన కంటెంట్‌లో ఎక్కువగా ఆసక్తిని కలిగివున్నారో అర్థం చేసుకోవడానికి మీరు ఈయొక్క ఫీచరుని ఉపయోగించుకోవచ్చు. అది దీర్ఘకాలంలో విశ్లేషణలని మెరుగుపరచేలా మీకు సాయపడుతుంది. మీయొక్క ప్రేక్షకులు ఒక నిర్దిష్ట రకమైన కంటెంట్‌లో గనుక ఆసక్తిని కలిగివుంటే, అదే విధమైన హ్యాష్‌ట్యాగ్‌ని చూపే సిఫారసులని పొందే అవకాశం వుంది, టిక్‌టాక్‌ ఆ విధంగా పనిచేస్తుంది. ఇది మీకు మీయొక్క వ్యాపారానికి సహాయం చేస్తుంది. ఇందుకే కేవలం ఏ వీడియో గొప్పగా పనిచేస్తోందో మరియు ఎక్కువగా ఏది ఆకర్షిస్తుందో చూపడానికి బదులు, హ్యాష్‌ట్యాగ్‌లపై మీకు పరిజ్ఞానాన్ని సమకూర్చే ఈ ఫీచరుని ఎక్జోలైట్ అమలు చేసింది.
టిక్‌టాక్‌-విశ్లేషణల-కొరకు-ఎక్జోలైట్
మీయొక్క అన్ని వీడియోలపై ఎక్జోలైట్ మీకు మరింత పరిజ్ఞానాన్ని ఇస్తుంది.
మీయొక్క కెరీర్ సమయంలో, మీ కంటెంట్‌లో కొంత మీకు విశేషంగా అనుచరులని సంపాదించి పెట్టిందని మీరు గమనించే వుంటారు; ఈ ఖచ్చితమైన డేటాని గమనించే ఒక ఫీచరుని ఎక్జోలైట్ అమలు చేసింది. ప్రతీ వీడియో నుండి మీరు సంపాదించిన అనుచరుల సంఖ్యని మీరు విశ్లేషించవచ్చు. మీ వ్యాపారం కొరకు ఏ కంటెంట్ ఎక్కువగా ప్రచారాన్ని తెచ్చిపెడుతుందో కనుగొనడానికి ఇది మీకు సాయపడుతుంది. మరింత నిరూపణ కొరకు ఈ క్రింది చిత్రాన్ని చూడండి:
టిక్‌టాక్‌-విశ్లేషణల-కొరకు-ఎక్జోలైట్
వీడియో విశ్లేషణ కొరకు ఎక్జోలైట్ అందిస్తున్న తరువాతి ఫీచరు ఎక్జోలైట్ యొక్క వీడియో టేబుల్. ఇది మీరు మీయొక్క కంటెంట్ గురించి తెలుసుకోవాల్సిన దేని గురించైనా పూర్తి విశ్లేషణని అందిస్తుంది. ఈ ఫీచరు వీడియో యొక్క టైటిల్‌ని, అది పోస్టు చేయబడిన తేదీని, వీక్షణలని, లైకులని, కామెంట్లని, మరియు అది కలిగివున్న నిమగ్నతని ప్రదర్శిస్తుంది.
టిక్‌టాక్‌-విశ్లేషణల-కొరకు-ఎక్జోలైట్
చివరగా, తాజాగా పోస్టు చేయబడిన కంటెంట్ మరియు దాని సంబంధిత గణాంకాల గురించి మీకు తాజా సమాచారాన్ని అందించే ఒక వీడియో జాబితాని ఎక్జోలైట్ సృష్టిస్తుంది.
టిక్‌టాక్‌-విశ్లేషణల-కొరకు-ఎక్జోలైట్
మీరు సులభంగా మీయొక్క ఖాతాని మీయొక్క పోటీదారుల ఖాతాతో పోల్చవచ్చు.
మీయొక్క స్వంత ఖాతాని పరిశోధించడం లాగానే మీ పోటీదారుని యొక్క పురోగతిని కూడా విశ్లేషించడం చాలా ముఖ్యం - అందుకనే ఇతరులతో పోల్చినపుడు మీ పనితీరు ఎలా వుందనే దాని మీద పరిజ్ఞానాన్ని మీకు అందించే ఎక్జోలైట్ యొక్క పోలీక (కంపారిజన్) ఫీచరుని మీరు ఉపయోగించాలి. మీరు అన్ని విభిన్నమైన అంశాలని పోల్చవచ్చు. అంతేకాకుండా, పనితీరు అనేది ఎలాంటి పోలికని కలిగివుందో తెలిపే సూచనని కూడా పోల్చవచ్చు. ఈ క్రింది చిత్రంలో మీరు చూసినట్లుగా, చార్లీ డమెలియో ప్రస్తుతం ఖబీ లామే కన్నా కూడా ఎక్కువ మంది అనుచరులని కలిగివుంది. అయినప్పటికీ, ఒక వారంలో చార్లీ కన్నా కూడా ఖబీయే ఎక్కువ మంది అనుచరులను సంపాదించాడు. (ఉత్తమమైన పనితీరుని ఆకుపచ్చ మరియు ఒక బంగారు రంగు నక్షత్రం గుర్తుతో చూపించడం జరుగుతుంది.)
[టిక్‌టాక్‌లో పోటీదారులని మీరెలా పోల్చగలరో తెలిపే}} ఎక్జోలైట్ అందించే గైడ్‌ని ఖచ్చితంగా చూడండి. (https://exolyt.com/guides/how-to-compare-competitors-on-tiktok).
టిక్‌టాక్‌-విశ్లేషణల-కొరకు-ఎక్జోలైట్
ఎక్జోలైట్ యొక్క వెబ్‌సైట్‌ 27 భాషలలో అందించబడుతోంది.
వీలైనంత మందికి మాయొక్క అసాధారణమైన సేవలు అందుబాటులో వుండేలా మేము చూసుకుంటాము. ఆ కారణం చేతనే మాయొక్క వెబ్‌సైట్‌ 27 భాషలలో అందించబడుతోంది. ముందు ముందు ఇంకెంతో తెస్తున్నాం కూడా!
ఎక్జోలైట్‌లో, మేము మీకు ఒక పోటీతత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ వీడియోలు ఎక్కువ వీక్షణలని సంపాదిస్తున్నాయో, ఇతర కంటెంట్ సృష్టికర్తల వాటితో ఎలా పోల్చాలో మరియు సిఫారసులని పొంది నిమగ్నతని ఎలా మెరుగుపరచాలో అర్థం చేసుకొనేందుకు సహకరించే శక్తివంతమైన విశ్లేషణలని మాయొక్క వినూత్నమైన వేదిక మీకు అందిస్తుంది.
వారి యొక్క కంటెంట్‌పై పరిజ్ఞానాన్ని కలిగించడానికి మేము సోషల్ మీడియా ఏజెన్సీలతో, ప్రపంచ బ్రాండ్లతో మరియు ఒంటరిగానే పనిచేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి మేము పనిచేస్తాము. ఒక డెమోని బుక్ చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి, లేదా మీయొక్క ఉచిత ట్రయల్‌ని ఈరోజే ప్రారంభించండి!
Parmis from Exolyt
Parmis from Exolyt
ఈ వ్యాసాన్ని Exolyt‌లో కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్న పార్మిస్ రాశారు. ఆమెకు రచన చేయడం, కొత్త విషయాలను సృష్టించడం మీద ఆసక్తి ఉంది, అలాగే తాజా TikTok ట్రెండ్‌లతో ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉంటారు.
ఈ వ్యాసాన్ని పంచుకోండి

ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం వ్యాసాలు